వాట్సాప్ త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రూప్ కాల్‌లో ఉన్నప్పుడు స్పెసిఫిక్ పర్సన్స్‌ను మ్యూట్ చేసే ఆప్షన్‌ను తెచ్చారు. దీంతోపాటు లాస్ట్ సీన్ స్టేటస్, అబౌట్, ప్రొఫైల్ ఫొటోను కూడా మనం కావాలనుకున్న యూజర్ల నుంచి హైడ్ చేయవచ్చు. గ్రూప్ వాయిస్ కాల్స్‌కు కొత్త ఇంటర్‌ఫేస్‌ను అందించిన కొన్ని రోజులకు ఈ ఫీచర్ లాంచ్ అయింది.


ఈ ఫీచర్ల గురించి వాట్సాప్ కూడా ట్వీట్ చేసింది. దీంతోపాటు గ్రూప్ వీడియో కాల్‌లో ఉండగానే అందులో ఒక వ్యక్తికి మెసేజ్ చేసే ఫీచర్ కూడా రానుంది. దీనికి మీరు గ్రూప్ వీడియో కాల్‌లో ఎవరికి వీడియో కాల్ చేయాలనుకుంటున్నారో వారి పేరుపై ట్యాప్ చేయాలి.


ప్రొఫైల్ ఫొటో, అబౌట్, లాస్ట్ సీన్‌లను కూడా స్పెసిఫిక్ కాంటాక్ట్స్ నుంచి హైడ్ చేసే ఆప్షన్‌ను వాట్సాప్ తీసుకురానుంది. దానికి మీరు సెట్టింగ్స్‌లో అకౌంట్‌పై ట్యాప్ చేసి, ప్రైవసీలోకి వెళ్లాలి. అక్కడ మీ కాంటాక్ట్స్‌లో ఎవరిని ఎంచుకుంటే వారికి మీ సమాచారం కనిపించదు.


వాట్సాప్ ఇటీవలే చాట్లను ఆండ్రాయిడ్ నుంచి ఐవోఎస్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఫీచర్‌ను కూడా తీసుకువచ్చింది. అయితే దీని ప్రాసెస్ కొంచెం ఎక్కువ సేపు తీసుకుంటుంది. దీనికి ఆండ్రాయిడ్ డివైస్‌లో ఆండ్రాయిడ్ 5 లేదా అంతకంటే పై వెర్షన్ ఆపరేటింగ్ సిస్టం, ఐఫోన్‌లో ఐవోఎస్ 15.5 లేదా అంతకంటే పై వెర్షన్ ఆపరేటింగ్ సిస్టంలు అవసరం అవుతాయి.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!