రియల్‌మీ నార్జో 50ఐ ప్రైమ్ జూన్ 22వ తేదీన లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం లాంచ్ కానున్న అత్యంత చవకైన రియల్‌మీ ఫోన్ ఇదే అంటున్నారు. ముందువైపు కెమెరా కోసం వాటర్ డ్రాప్ నాచ్ ఉండనుంది. ఎన్బీటీసీ, యూరోపియన్ ఎకనమిక్ కమ్యూనిటీ (ఈఈసీ), యూఎస్ ఎఫ్‌సీసీ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్ సైట్లలో కూడా ఈ ఫోన్ కనిపించింది. రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది.


91మొబైల్స్ కథనం ప్రకారం... ఈ ఫోన్ వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ స్టీవ్ హెమ్మర్‌స్టోఫర్ లీక్ చేశారు. దీని ధర, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీన్ని బట్టి జూన్ 22వ తేదీన రియల్‌మీ నార్జో 50ఐ ప్రైమ్ లాంచ్ కానుంది.


రియల్‌మీ నార్జో 50ఐ ప్రైమ్ ధర (అంచనా)
ఈ స్మార్ట్ ఫోన్ ధర 100 డాలర్ల (సుమారు రూ.7,800) రేంజ్‌లో ఉండనుందని తెలుస్తోంది. రియల్‌మీ ఈ సంవత్సరం లాంచ్ చేయనున్న అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ ఇదే కానుంది. బ్లాక్, గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది.


రియల్‌మీ నార్జో 50ఐ ప్రైమ్ స్పెసిఫికేషన్లు (అంచనా)
దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు, డిజైన్ ఫీచర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇందులో వెనకవైపు ఒక్క కెమెరా ఉండనుంది. ఎల్ఈడీ ఫ్లాష్, నార్జో బ్రాండింగ్ కూడా వెనకవైపు ఉన్నాయి. టెక్స్చర్డ్ డిజైన్, వర్టికల్ స్ట్రిప్స్ కూడా అందించారు.


సన్నటి అంచులను ఇందులో చూడవచ్చు. ఫ్రంట్ కెమెరా కోసం వాటర్ డ్రాప్ నాచ్‌ను అందించారు. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్, సిమ్ ట్రేలు ఫోన్‌కు ఎడమవైపు ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 181 గ్రాములుగా ఉంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!