జేఎల్‌క్యూ జేఆర్510 ప్రాసెసర్‌తో పనిచేసే మొట్టమొదటి స్మార్ట్ ఫోన్‌ను పోకో లాంచ్ చేసింది. అదే పోకో సీ40. ప్రపంచంలో ఈ ప్రాసెసర్‌తో లాంచ్ అయిన మొదటి ఫోన్ ఇదే. చైనాకు చెందిన జేవీ అనే కంపెనీ ఈ ప్రాసెసర్‌ను రూపొందించింది.


పోకో సీ40 ధర
ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే 150 డాలర్ల (సుమారు రూ.11,700) రేంజ్‌లో దీని ధర ఉండవచ్చని అంచనా. పవర్ బ్లాక్, కోరల్ గ్రీన్, పోకో ఎల్లో రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో ఈ ఫోన్ లాంచ్ అయితే రూ.10 వేలలోపు రేంజ్‌లోనే వచ్చే అవకాశం ఉంది.


పోకో సీ40 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.7 అంగుళాల హెచ్‌డీ+ ఉన్న డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 720 x 1560 పిక్సెల్స్‌గా ఉండగా... రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. జేఎల్‌క్యూ జేఆర్510 ఎంట్రీ లెవల్ ప్రాసెసర్‌తో లాంచ్ అయిన మొట్టమొదటి ఫోన్ ఇదే.


4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా... 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. డ్యూయల్ సిమ్ కార్డు స్లాట్, 4జీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీఎన్ఎస్ఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!