రియల్‌మీ మనదేశంలో తన బడ్జెట్ ఫోన్ సీ30ని లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను రియల్‌మీ తన సోషల్ మీడియా చానెళ్ల ద్వారా విడుదల చేసింది. జూన్ 20వ తేదీన మధ్యాహ్నం 12:30 నిమిషాలకు ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుంది.
ఈ ఫోన్ ఇప్పటికే ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయింది. ఇందులో ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు కూడా చూడవచ్చు. రియల్‌మీ సీ30 ప్రాసెసర్, బ్యాటరీ, బరువు, మందం వంటి కీలక అంశాలను కూడా కంపెనీ లాంచ్‌కు ముందే రివీల్ చేసింది. ఇక ధరను రివీల్ చేయడం ఒక్కటే బ్యాలెన్స్. ఉంది దీని ఫీచర్లను బట్టి చూస్తే రియల్‌మీ సీ30 ధర రూ.8 వేలలోపే ఉండే అవకాశం ఉంది.
రియల్‌మీ సీ30 ఫీచర్లు
రియల్‌మీ సీ30 స్మార్ట్ ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. రియల్‌మీ సీ30 మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 181 గ్రాములుగా ఉంది.
ఆక్టాకోర్ యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్‌లో రెండు స్టోరేజ్ వేరియంట్లు ఉండనున్నాయి. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌తో ఒక వేరియంట్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌తో ఒక వేరియంట్ లాంచ్ కానుంది. ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్, ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
దీనికి సంబంధించిన అధికారిక రెండర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. వాటర్ డ్రాప్ తరహా నాచ్‌ను ఈ ఫోన్‌లో అందించారు. ఫోన్ కిందివైపు అంచు బాగా మందంగా ఉంది. ఫోన్ వెనకవైపు ప్రత్యేకమైన డిజైన్ అందించారు. రియల్‌మీ బ్రాండింగ్, వెనకవైపు కెమెరాను కూడా చూడవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అందించలేదు.
స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్ , మైక్రో యూఎస్‌బీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. బ్లూ, గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!