శాంసంగ్ తన ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఏ04 కోర్‌ను మనదేశంలో లాంచ్ చేయనుంది. ఇప్పుడు ఈ ఫోన్ రెండర్లు, ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఐఫోన్ తరహా గోల్డ్ కలర్ ఆప్షన్ కూడా ఇందులో అందించారని ఫొటో చూస్తే తెలుస్తోంది.
గతేడాది లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. ప్రముఖ టిప్‌స్టర్ రోలాండ్ క్వాండ్ట్ దీనికి సంబంధించిన హైరిజల్యూషన్ రెండర్లు లీక్ చేశారు.ఈ రెండర్ల ప్రకారం ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ సిరీస్ ఫోన్లు రూ.12 వేలలోపు ధరలోనే లాంచ్ అవుతాయి. కాబట్టి దీని ధర కూడా రూ.10 వేల ఉండే అవకాశం ఉంది.
ఫోన్ వెనకవైపు ఒక్క కెమెరా మాత్రమే ఉంది. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. బ్లాక్, గ్రీన్, కాపర్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వాల్యూమ్ బటన్లు, పవర్ బటన్ ఫోన్‌కు కుడివైపున ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల పీఎల్ఎస్ టీఎఫ్‌టీ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ యూనిసోక్ ఎస్సీ9863ఏ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. 4జీ ఎల్టీఈ, వైఫై, వైఫై డైరెక్ట్, బ్లూటూత్ వీ4.2, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, జీపీఎస్, గ్లోనాస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లను ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. పవర్, వాల్యూమ్ బటన్లు ఫోన్‌కు కుడివైపు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్ మందం 0.91 సెంటీమీటర్లు కాగా, బరువు 211 గ్రాములుగా ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!