నథింగ్ ఫోన్ 1 స్మార్ట్ ఫోన్ గ్లోబల్ లాంచ్ జులై 12వ తేదీన జరగనుంది. వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పెయ్ బయటకు వచ్చిన ఈ నథింగ్ బ్రాండ్‌ను స్థాపించారు. ఈ బ్రాండ్‌పై ఇప్పటికే నథింగ్ ఇయర్ (1) వైర్‌లెస్ ఇయర్ బడ్స్ వచ్చాయి. పెద్ద సక్సెస్ కూడా అయ్యాయి. ఇప్పుడు లాంచ్ కానున్న నథింగ్ ఫోన్ 1పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ స్మార్ట్ ఫోన్ వెనకవైపు భాగం డిజైన్‌ని రివీల్ చేస్తున్నట్లున్న ఒక పోస్టర్‌ను కంపెనీ రిలీజ్ చేసింది. ఇందులో స్మార్ట్ ఫోన్‌పై చిలక నుంచి మధ్యలో దేన్నో కొరుక్కుతింటున్నట్లు చూపించారు. ఇది ఇన్‌డైరెక్ట్‌గా యాపిల్‌కు చాలెంజ్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
దీన్ని కంపెనీ వ్యవస్థాపకుడు కార్ల్ పెయ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల్లో షేర్ చేశారు. ఫోన్ వెనకవైపు తెల్లటి ఫినిష్‌ను అందించారు. అంచులు గుండ్రంగా ఉన్నాయి. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలనే అందించారు. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. నథింగ్ ఫోన్ కిందవైపు ఉంది. వాల్యూమ్ కంట్రోల్ బటన్లు ఫోన్‌కు కుడివైపు ఉండనున్నాయి. పవర్ బటన్ ఎడమవైపు అందించనున్నారు.
ఈ ఫోన్ ఇటీవలే బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ (బీఐఎస్) లిస్టింగ్‌లో కూడా కనిపించింది. 45W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీనికి సంబంధించిన వర్చువల్ ఈవెంట్ జులై 12వ తేదీన రాత్రి 8:30 గంటలకు జరగనుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను కంపెనీ విడుదల చేయలేదు.
ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను ఇందులో అందించనున్నారు. దీనికి సంబంధించిన సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో జరగనుంది. ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో కూడా తయారు చేస్తామని కంపెనీ తెలిపింది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!