మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. రెండు బిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లతో ప్రపంచంలో టాప్ యాప్ కొనసాగుతున్న వాట్సాన్ మరో ఉపయోగకరమైన ఫీచర్‌ను విడుదల చేసింది. ఇప్పుడు వినియోగదారులు వీడియో బటన్‌ను నొక్కి పట్టు కోకుండానే వీడియోలను రికార్డ్ చేసే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకుముందు వినియోగదారులు వాట్సాప్ వీడియో రికార్డ్ బటన్‌ను నొక్కి పట్టుకుంటేనే వీడియో రికార్డ్ అయ్యేది. పట్టుకోవాలి. WhatsApp వీడియో మోడ్‌కు మారడం అని పిలుస్తుంది.
ఇకపై ఈజీగా వీడియో రికార్డ్ చేసే అవకాశం
వాట్సాప్ న్యూస్, ఫీచర్ రిపోర్టింగ్ వెబ్‌సైట్ WaBetaInfo నివేదిక ప్రకారం, ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం Google Play Storeలో అందుబాటులో ఉన్న Android 2.23.2.73 అప్ డేట్ తో వస్తుంది. వాట్సాప్ కొన్ని బీటా టెస్టర్ల కోసం కొత్త కెమెరాను కూడా విడుదల చేసింది. కెమెరా మోడ్‌లోని కొత్త హ్యాండ్స్ ఫ్రీ ఫీచర్ కేవలం ఒక ట్యాప్‌తో వీడియోను రికార్డ్ చేసే అవకాశం కల్పిస్తుంది. కేవలం ఒక ట్యాప్‌తో వీడియో మోడ్ కి మారే సదుపాయంతో వాట్సాప్ కెమెరాను రీడిజైన్ చేసినట్లు వాట్సాప్ వెల్లడించింది. వీడియోలను రికార్డ్ చేయడానికి నొక్కి పట్టుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది.ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ వీడియోలను క్యాప్చర్ చేయడానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపింది. వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ నుంచి బ్యాక్ కెమెరాకు సులువుగా మారే వెసులుబాటు ఉంటుందని తెలిపింది. ఇప్పటికే పలువురు బీటా టెస్టర్లు కొత్త కెమెరా మోడ్‌ను పరిశీలించినట్లు వెల్లడించింది.
మరిన్ని ఫీచర్లపై వాట్సాప్ వర్కౌట్
మరోవైపు, వాట్సాప్ Ios, Android వినియోగదారుల కోసం ప్లాట్‌ఫారమ్‌లో పిక్చర్ ఇన్ ప్లేస్ మోడ్, వ్యూ వన్స్ టెక్స్ట్, కంపానియన్ మోడ్, డేట్ వారీగా మెసేజ్‌లను సెర్చ్ చేయడం, స్టేటస్‌పై వాయిస్ నోట్స్, స్క్రీన్ లాంటి మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. WhatsApp డెస్క్ టాప్ కోసం లాక్, కాల్ ట్యాబ్ లాంటి ఫీచర్లను సైతం డెవలప్ చేస్తున్నట్లు వెల్లడించింది.అటు కాలిస్టోగా, కొరియర్ ప్రైమ్, డామియన్, ఎక్సో 2, మార్నింగ్ బ్రీజ్ తో సహా కొత్త ఫాంట్‌లతో అప్‌డేట్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది.
యూజర్లు ఫోటోలు, వీడియోలు, GIFలలో తమ టెక్ట్స్ తో పాటు మరింత సృజనాత్మకతను జోడించే అవకాశం ఉంటుందని తెలిపిది. ఇకపై యూజర్లు చెప్పాలనుకున్న విషయాన్ని మరింత ఆకట్టుకునేలా చెప్పే అవకాశం ఉంటుందని వెల్లడించింది. వినియోగదారుల భద్రత విషయంలోనూ సరికొత్త అప్ డేట్స్ తీసుకొస్తున్నట్లు తెలిపింది.
Read Also: ఆండ్రాయిడ్‌కి పోటీగా భారత ఓఎస్, ‘BharOS’ రూపొందించిన మద్రాస్ ఐఐటీ