Whatsapp New Feature: ‘వ్యూ వన్స్’ - వాట్సప్‌లో సరికొత్త పీచర్, ఒక్కసారి చూడగానే మాయమైపోతుంది!

వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. ఎదుటి వారు పంపిన మెసేజ్ ఒకసారి చూడగానే కనిపించకుండా పోయేలా సరికొత్త ఫీచర్ ను రూపొందించింది.

Continues below advertisement

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడంతో ముందుంటుంది ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. తాజా మరో అద్భుతమైన ఫీచర్ ను వినియోగదారులకు పరిచయం చేయబోతున్నది. ‘వ్యూ వన్స్’ అనే పేరుతో ఈ ఫీచర్ బీటా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

Continues below advertisement

ఈ ఫీచర్ ప్రత్యేకత ఏంటంటే?

‘వ్యూ వన్స్’ ఫీచర్ ద్వారా ఎదుటి వారు పంపిన మెసేజ్ ను కేవలం ఒకేసారి చూసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ మెసేజ్ మాయం అవుతుంది. గతంలో ఇలాంటి మెసేజ్  అవకాశం అందుబాటులోకి తెచ్చింది. అయితే, సుమారు వారం రోజుల తర్వాత వాటంతట అవే మెసేజ్ లు కనిపించకుండా పోయేవి. మరికొద్ది రోజుల తర్వాత వాట్సాప్ 24 గంటలు, లేదంటే 90 రోజుల తర్వాత మెసేజ్ లు అదృశ్యమయ్యేలా రూపొందించింది.

యూజర్ల ప్రైవసీ కోసమే ఈ ఫీచర్

ప్రస్తుతం ‘వ్యూ వన్స్’ ఫీచర్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. వెర్షన్ 2.22.25.20 ద్వారా ఈ సరికొత్త ఫీచర్‌ను పొందవచ్చు. అంతేకాదు, ఈ విధానం ద్వారా పంపిన మెసేజ్ లను, ఫోటోలను, వీడియోలను ఇతరులకు ఫార్వర్డ్ చేసే అవకాశం ఉండదు. అంతేకాదు. ఎదుటి వారు పంపిన మెసేజ్ లను స్ర్కీన్ షాట్ కూడా తీసే అవకాశం ఉండదు. ‘వ్యూ వన్స్’ ప్రకారం టెక్ట్స్, ఫోటోలు, వీడియోలు పంపుకునే అవకాశం ఉంటుంది.  సరికొత్త ఫీచర్ తమకు అందుబాటులో ఉందో? లేదో? ఎలా తెలుసుకోవాలంటే  క్యాప్షన్ ప్రాంప్ట్‌ లో రైట్ సైడ్ లో కనిపించే 1 ఐకాన్‌ మీద క్లిక్ చేయాలి.  ఇలా చేయడం ద్వారా వ్యూ వన్స్ అవకాశాన్ని పొందే వెసులుబాటు ఉంటుంది. అయితే, బీటా నుంచి ఫీచర్ రిలీజ్ అయిన తర్వాత డిజైన్ మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే కేవలం టెక్ట్స్ మెసేజ్‌ ‌‌తో కూడిన స్పెషల్ సెండ్ బటన్ ఐకాన్ మాత్రమే కనిపిస్తోంది.

త్వరలో అందుబాటులోకి ‘మెసేజ్ యువర్ సెల్ఫ్’ ఫీచర్

అటు కొద్ది రోజుల క్రితం వాట్సాప్ ప్రకటించినట్లుగా ‘మెసేజ్ యువర్ సెల్ఫ్’ అనే ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. విండోస్ బీటా యూజర్లు  ఈ ఫీచర్‌ ను పొందే అవకాశం ఉంటుంది. వాట్సాప్ బీటా ఇన్‌ స్టాల్ చేసిన డెస్క్‌ టాప్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని మెసేజింగ్ యాప్ ప్రకటించింది. త్వరలోనే ఈ ఫీచర్ మిగతా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫీచర్ ద్వారా ఎవరికి వారు టెక్ట్స్, ఫోటోలు, వీడియోలు పంపుకునే అవకాశం ఉంటుంది.

Read Also: ఆ అకౌంట్లకు బ్లూటిక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎలన్ మస్క్ కీలక ప్రకటన

Continues below advertisement