WhatsApp Redesigned Keyboard: వాట్సాప్ భారతదేశంలో 500 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా ప్రజలు ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. వినియోగదారుడి అనుభవాన్ని మెరుగుపరచడానికి, కంపెనీ ఎప్పటికప్పుడు యాప్‌కి కొత్త అప్‌డేట్‌లను తెస్తుంది. మెటా త్వరలో ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం అప్‌డేట్ అయిన కీబోర్డ్‌ను తీసుకురాబోతోంది.


అప్‌డేట్ ఇదే
వాట్సాప్ గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పర్యవేక్షించే వెబ్‌సైట్ Wabetainfo ప్రకారం, కంపెనీ కీబోర్డ్‌కు సంబంధించి యూఐని రీడిజైన్ చేస్తోంది. అప్‌డేట్ కింద వినియోగదారులు జిఫ్, స్టిక్కర్, ఎమోజీ ఆప్షన్లను కీబోర్డ్‌లో దిగువన కాకుండా ఎగువన పొందుతారు.


అదేవిధంగా, విభిన్న మూడ్‌ల ఎమోజీని ఎంచుకోవడానికి, కంపెనీ ఎమోజి ప్యానెల్‌ను పైభాగానికి బదులుగా దిగువకు మార్చబోతోంది. దీంతో పాటు వినియోగదారులు డెస్క్‌టాప్‌లోని ప్లస్ సైన్ తరహాలో ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసే ఆప్షన్‌ను పొందుతారు. దానిపై క్లిక్ చేయడం ద్వారా వారు కాంటాక్ట్, ఇమేజ్, పోల్ విభిన్న ఆప్షన్లను ఎంచుకోగలుగుతారు.


మొత్తం మీద మెరుగైన చాటింగ్ ఎక్స్‌పీరియన్స్, అన్ని ఫంక్షన్‌లకు ఒక క్లిక్ యాక్సెస్ కోసం కంపెనీ ఈ అప్‌డేట్‌లను యాప్‌కి తీసుకువస్తోంది. ప్రస్తుతం ఈ అప్‌డేట్ కొంతమంది బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది. ఇది రాబోయే కాలంలో అందరికీ అందుబాటులో ఉంటుంది.


నంబర్‌కు బదులుగా వినియోగదారుడి పేరు మాత్రమే
వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్‌పై పని చేస్తోంది. దీని కింద వినియోగదారులు తమ ప్రత్యేకమైన యూజర్ నేమ్‌ను సెట్ చేయగలరు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో యూజర్‌నేమ్ సౌకర్యం ఉన్నట్లే వాట్సాప్‌లో కూడా అదే జరుగుతుంది. యూజర్‌నేమ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత కాంటాక్ట్‌కి ఎవరినైనా యాడ్ చేయడానికి మీరు మళ్లీ నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు యూజర్‌నేమ్ సహాయంతో ఎవరినైనా యాడ్ చేయవచ్చు. అలాగే మీరు మీ నంబర్‌ను ఇతరుల నుండి హైడ్ చేయవచ్చు.


సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే వాట్సాప్, మరో అదిరిపోయే ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. బిజినెస్ అవసరాలకు ఉపయోగపడేలా ‘స్టేటస్ ఆర్కైవ్’ అనే పేరుతో కొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. అయితే, ఈ ఫీచర్ కేవలం బిజినెస్ యాప్ కు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఫీచర్ ద్వారా వ్యాపార నిర్వాహకులు, వినియోగదారుల మధ్య సంబంధాలను మరింత మెరుగుపరిచే అవకాశం ఉందని వాట్సాప్ వెల్లడించింది. ఈ నూతన ఫీచర్ ను ఆండ్రాయిడ్ బిజినెస్ యాప్ బీటా వినియోగదారులతో టెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. త్వరలోనే ఈ ఫీచర్ ను బిజినెస్ యాప్ వినియోగదారులందరికీ అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది.


కొద్ది రోజుల క్రితమే ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్ లో కాల్స్ ట్యాబ్ కు సరికొత్త మార్పులు చేసింది మెటా యాజమాన్యం. అందులో భాగంగానే ఇప్పుడు ‘స్టేటస్ ఆర్కైవ్’ అనే ఫీచర్ ను పరిచయం చేసింది. ఇది వాట్సాప్ లేటెస్ట్ అప్ డేట్స్ ను ఇన్ స్టాల్ చేసిన తర్వాత కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులు మాత్రమే ఈ కొత్త ఫీచర్ ను ఉపయోగించగలుగుతున్నారు. వాట్సాప్ ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేసిన తర్వాత, ఈ ఫీచర్ యాక్టివ్ గా ఉన్నట్లు స్టేటస్ ట్యాబ్ బ్యానర్ వినియోగదారులకు సూచిస్తుందని తెలిపింది.


Read Also: వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్, ఇకపై మీ స్క్రీన్ ఇతరులకు షేర్ చెయ్యొచ్చు!