WhatsApp Update: ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. వాట్సాప్ చాటింగ్ విషయంలో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. డిస్ అప్పియరింగ్ మెస్సేజెస్ ఫీచర్‌ను మరో రెండు మోడ్‌లలో అందుబాటులోకి తెచ్చినట్లు వాట్సాప్ సంస్థ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. మెటా సంస్థకు చెందిన వాట్సాప్ డిస్ అప్పియరింగ్ మెస్సేజెస్ (ఆటో డిలీట్) ఫీచర్‌ రెండు మోడ్‌లలో తీసుకొచ్చింది. 


ఈ ఫీచర్‌ను మీరు ఓకే చేసుకుంటే వాట్సాప్ చాటింగ్, మెస్సేజ్‌లు 24 గంటల తరువాత ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి. రెండో ఆప్షన్ తీసుకుంటే 90 రోజుల తరువాత మీ వాట్సాప్ మెస్సేజ్‌లు డిస్ అప్పియర్ అవుతాయని మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఇప్పటివరకూ వాట్సాప్ చాటింగ్ 7 రోజుల తరువాత ఆటోమేటిక్ గా డిలీట్ అవుతాయి. వీటికి అదనంగా మరో రెండు టైమ్ పీరియడ్స్‌లో మెస్సేజ్‌లు వాటంతట అవే డిలీట్ అయ్యే ఫీచర్‌ను తీసుకొచ్చింది.   


ఇది ఎలా అప్లై చేయాలంటే..
వన్ టు వన్ చాటింగ్‌లో మీరు ఇతరులకు మెస్సేజ్ పంపే సమయంలోగానీ, లేక మీకు ఇతర వాట్సాప్ యూజర్ మెస్సేజ్ చేసేటప్పుడు డిస్‌అప్పియరింగ్ మెస్సేజ్ ఫీచర్‌ను ఆన్ చేసుకుంటే చాలు. అయితే ఆ చాటింగ్ 24 గంటల్లో డిలీట్ అయిపోవాలా, లేక 7 రోజులా, 90 రోజులా అనేది నిర్ణయించుకుని ఈ ఫీచర్‌ను అప్లై చేయాలని వాట్సాప్ ప్రతినిధులు వెల్లడించారు. కొత్తగా క్రియేట్ చేసే వాట్సాప్ గ్రూప్‌లకు సైతం ఈ ఫీచర్‌ను మీరు ఆన్ చేసుకుని చాటింగ్ హిస్టరీని ఆటోమేటిక్‌గా డిలీట్ చేసుకునే సౌలభ్యాన్ని వినియోగదారులకు కల్పించింది.
Also Read: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మెసేజ్ డిలీట్ చేయాలా? అయితే ఇక బేఫికర్!


ఆప్షన్ మీ ఛాయిస్..
ఇప్పటివరకూ చేసిన చాటింగ్ డిలీట్ అవుతుందేమోనన్న అనుమానాలు మీకు అక్కర్లేదు. కేవలం మీరు ఎంచుకున్న చాటింగ్‌కు మాత్రమే డిస్‌అప్పియరింగ్ మెస్సేజెస్ ఫీచర్ వర్తిస్తుందని వాట్సాప్ తెలిపింది. గత ఏడాది ఈ ఫీచర్‌ను టెక్ట్స్ మెస్సేజ్‌లకు మాత్రమే తీసుకురాగా.. ఆపై ఫొటోలు, వీడియోలకు సైతం ఇలాంటి అవకాశాన్ని కల్పించింది. అయితే టెక్ట్స్ మెస్సేజ్‌ల తరహాలో కాకుండా. వ్యూ వన్స్ అనే ఫీచర్‌ను ఫొటోలు, వీడియోల కోసం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఈ ఫీచర్ మీరు అప్లై చేసుకున్నట్లయితే చాటింగ్‌లో ఆ ఫొటో, వీడియో మీరు ఒక్కసారి మాత్రమే చూడగలుగుతారు. ఆపై కనిపించదని తెలిసిందే.
 Also Read: Whatsapp Tricks: పొరపాటున వాట్సాప్ చాట్లు డిలీట్ చేశారా.. ఇలా చేస్తే మళ్లీ వచ్చేస్తాయ్!


ఇటీవల ఫ్లాష్ కాల్, మెసేజ్ లెవల్ రిపోర్టింగ్ ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్ మరికొన్ని ఫీచర్లపై ఫోకస్ చేస్తోంది. ఆటోమేటిక్‌గా మెస్సేజ్‌లు డిలీట్ చేసుకునేందుకు మరో రెండు టైమ్ పీరియడ్స్‌లో కొత్త ఫీచర్ లాంచ్ చేసింది. భారత్‌లోని ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ విధానం వివాదం తరువాత వినియోగదారులను నిలుపుకునేందుకు కంపెనీ తీవ్రంగా శ్రమిస్తోంది.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి