కొన్నిసార్లు మనం రకరకాల కారణాల వల్ల వాట్సాప్ చాట్‌లను కోల్పోతాం. పొరపాటున డిలీట్ చేయడం వల్ల కావచ్చు, డివైస్‌లు మార్చడం వల్ల కావచ్చు, ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చాట్లలో ఉండే ముఖ్యమైన సమచారం దీని ద్వారా పోయే అవకాశం ఉంది. ఇందులో కాంటాక్ట్స్, మ్యాప్స్, డాక్యుమెంట్లు కూడా ఉండవచ్చు. అయితే అదృష్టవశాత్తూ పోయిన వాట్సాప్ చాట్లను కూడా తిరిగి పొందే అవకాశం ఉంది.


వాట్సాప్ మీ చాటింగులను తన సర్వర్లలో స్టోర్ చేసుకోదు. దానికి బదులు మీ గూగుల్ డ్రైవ్ లేదా డివైస్ ఇంటర్నల్ స్టోరేజ్‌లో డేటాబేస్ క్రియేట్ చేస్తుంది. ఇందులో మీ వాట్సాప్ చాట్ హిస్టరీ బ్యాకప్ అవుతుంది. ఒకవేళ మీరు పొరపాటున చాట్ హిస్టరీ డిలీట్ చేసినా.. పోగొట్టుకున్నా.. వీటి ద్వారా తిరిగి పొందవచ్చు.


వాట్సాప్ చాట్లను గూగుల్ డ్రైవ్ నుంచి రీస్టోర్ చేయడం ఎలా?
ముందుగా మీ గూగుల్ డ్రైవ్ అకౌంట్‌లోకి వాట్సాప్ చాట్ హిస్టరీ బ్యాకప్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఒకవేళ మీరు కొత్త డివైస్‌కు మారాలనుకుంటే, అందులో ముందుగా మీ గూగుల్ ఖాతాలోకి లాగిన్ అవ్వాలి. వినియోగదారులు డైలీ, వీక్లీ, మంత్లీ బ్యాకప్ చేసుకోవచ్చు.


వాట్సాప్ చాట్ హిస్టరీని రీస్టోర్ చేయడానికి.. వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసుకుని, ఫోన్ నంబర్ వెరిఫై చేసుకోవాలి. సైన్ ఇన్, వెరిఫికేషన్ అయ్యాక గూగుల్ డ్రైవ్ నుంచి చాట్ హిస్టరీ రీస్టోర్ చేయాలా అని వాట్సాప్ అడుగుతుంది. అప్పుడు రీస్టోర్ మీద క్లిక్ చేస్తే.. ఆ ప్రాసెస్ పూర్తి అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. పూర్తయ్యాక నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీ పాత చాట్లు కనిపిస్తాయి.


లోకల్ బ్యాకప్ నుంచి చాట్ హిస్టరీ తీసుకోవడం..
మీ ఫైల్ మేనేజర్‌లో వాట్సాప్ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఇది మీ ఇంటర్నల్ స్టోరేజ్‌లో ఉంటుంది. ఆ ఫోల్డర్‌లో డేటాబేస్‌లపై క్లిక్ చేయండి. అక్కడ మీ వాట్సాప్ చాట్ హిస్టరీ రోజువారీగా అందుబాటులో ఉంటుంది. మీకు కావాల్సిన డేట్ చాట్ హిస్టరీ ఇందులో ఉందో లేదో చూసుకోండి.


ఒకవేళ మీ వాట్సాప్ డేటాను ఎస్‌డీ కార్డులో సేవ్ చేసుకుంటే దాన్ని మీ ఇంటర్నల్ స్టోరేజ్‌కు మార్చుకోండి. ఇప్పుడు వాట్సాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి. మీ ఫోన్ నంబర్‌తో లాగిన్ అవ్వండి. ఇప్పుడు వాట్సాప్‌ను మీ చాట్ హిస్టరీ రీస్టోర్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి.


మీకు కావాల్సిన తేదీల నుంచి చాట్లను బ్యాకప్ చేయడానికి డేటాబేస్ నుంచి మీకు కావాల్సిన ఫైల్‌ను ఎంచుకోండి. దాన్ని msgstore-YYYY-MM-DD.1.db.crypt12 నుంచి msgstore.db.crypt12 కు రీనేమ్ చేయండి. జాగ్రత్తగా అందులో కేవలం తేదీని మాత్రమే మార్చి మిగతా దాన్ని అలానే ఉంచేయండి. క్రిప్ట్ ఎక్స్‌టెన్షన్ కూడా మార్చకండి. ఆ తర్వాత మీ చాట్ బ్యాకప్‌లు ఆటోమేటిక్‌గా రీస్టోర్ అవుతుంది.


Also Read: Xiaomi 12: ఒకే ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా, మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. అదిరిపోయే మొబైల్ వచ్చేస్తుంది!


Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?


Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!


Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!


Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి