WhatsApp Status Update: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ స్టేటస్ సెక్షన్ లేఅవుట్‌లో పెద్ద మార్పు చేసింది. ఇప్పుడు వినియోగదారులకు వారి ఫ్రెండ్స్ స్టేటస్ అప్‌డేట్స్‌ను చూడటం చాలా సులభం అయింది. వినియోగదారులు ఇప్పుడు స్టేటస్‌ను తెరవకుండానే చూడగలరు. కొత్త అప్‌డేట్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం స్టేబుల్ వెర్షన్‌లో విడుదల అయింది.


వాట్సాప్‌లో వినియోగదారులు ఇప్పుడు స్టేటస్ అప్‌డేట్స్ కోసం ప్రత్యేక విభాగాన్ని పొందారు. ఇంతకుముందు ప్రొఫైల్ ఫోటోతో పాటు సర్క్యులర్ అప్‌డేట్లు కనిపించేవి. కానీ కొత్త లేఅవుట్‌లో ఫేస్‌బుక్ స్టోరీల తరహాలో వర్టికల్ స్టేటస్‌లు కనిపిస్తాయి. మీరు వాటిని ఓపెన్ చేయకుండా వాటికి సంబంధించిన గ్లింప్స్ చూడవచ్చు. దీని వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ఈ విధంగా స్టేటస్‌ను చూస్తే... మీరు చూసినట్లు అవతలి వారికి తెలియదు. 


Also Read: రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో 108 మెగాపిక్సెల్ ఫోన్లు కూడా!


ఈ కొత్త ఫీచర్‌ని ఎలా ఉపయోగించుకోవచ్చు?
మీరు ఇంకా స్టేటస్ అప్‌డేట్ల ఈ కొత్త ఫీచర్‌ని పొందకుంటే యాప్‌ని లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేయవచ్చు. ఇందుకోసం గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్‌కు వెళ్లి అక్కడి నుంచి వాట్సాప్ తాజా వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ఈ కొత్త ఫీచర్ లుక్ కొంతవరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని పోలి ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ ఫీచర్ ఇలానే ఉంటుంది.


వాయిస్ మెసేజ్‌లను చదవడాన్ని మరింత సులభతరం చేసే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ఇటీవల ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా వాయిస్ మెసేజ్‌ల టెక్స్ట్ ట్రాన్స్‌క్రిప్షన్ ఇప్పుడు అందుబాటులో ఉంటుంది. తద్వారా మీరు వాయిస్ మెసేజ్‌లను వినడానికి బదులుగా దాన్ని చదవవచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది. వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ వచ్చినప్పుడు మీ చుట్టూ బాగా గోలగా ఉంటే ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్స్ ఉన్నారు.



Also Read: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!