Whatsapp Channel Reports: వాట్సాప్ తన ఆండ్రాయిడ్ యాప్‌లో కొత్త ఫీచర్‌ను లాంచ్ చేయడం ప్రారంభించింది. ఈ ఫీచర్ పేరు ఛానెల్ రిపోర్ట్. దీని ద్వారా వినియోగదారులు ఛానెల్స్‌కు ఎన్ని రిపోర్ట్‌లు వచ్చాయి? వాటిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అనే సమాచారాన్ని కూడా పొందగలరు.


వాట్సాప్ కొత్త ఫీచర్
వాట్సాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం మాత్రమే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడం ప్రారంభించింది. అటువంటి పరిస్థితిలో ఆండ్రాయిడ్ పరికరాలలో వాట్సాప్‌ని ఉపయోగిస్తున్న వినియోగదారులు ఛానెల్ రిపోర్ట్స్‌ను పొందడం ప్రారంభించారు. అయితే ప్రస్తుతానికి కంపెనీ ఈ ఫీచర్‌ని బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ 2.24.3.31 అప్‌డేట్ ద్వారా ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ అప్‌డేట్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.


కొత్త ఫీచర్‌ని ఎలా ఉపయోగించాలి?
1. ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి వినియోగదారులు తమ వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి.
2. ఆ తర్వాత మీరు కుడి వైపున పైభాగంలో కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
3. అనంతరం వినియోగదారులు సెట్టింగ్స్‌లో చాలా ఆప్షన్లు కనిపిస్తాయి.
4. అక్కడి నుంచి కిందకి స్క్రోల్ చేస్తే మీకు హెల్ప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.


ఇంతకు ముందు యూజర్లకు హెల్ప్ కింద మూడు ఆప్షన్లను మాత్రమే పొందేవారు. ఇందులో హెల్ప్ సెంటర్, టెర్మ్స్, ప్రైవసీ పాలసీ, యాప్ ఇన్ఫో ఉండేవి. కానీ ఇప్పుడు యూజర్లు ఛానెల్ రిపోర్ట్స్ అనే కొత్త ఆప్షన్‌ను కూడా పొందుతారు. ఈ కొత్త ఆప్షన్‌ను క్లిక్ చేసిన తర్వాత వినియోగదారులు ఏ ఛానెల్స్‌ను రిపోర్ట్ చేశారు. వాటిపై వాట్సాప్ ఎలాంటి చర్యలు తీసుకుందో చూడవచ్చు. అయితే వాట్సాప్ సాధారణ యూజర్ల కోసం ఈ ఫీచర్‌ను ఇంకా ప్రారంభించలేదు. రాబోయే కాలంలో వాట్సాప్ ఈ ఫీచర్‌ని వినియోగదారులందరికీ తీసుకువస్తుందని భావిస్తున్నారు.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?