Whatsapp Channel Features: వాట్సాప్‌కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. కంపెనీ కూడా ఎప్పటికప్పుడు యాప్‌కు కొత్త అప్‌డేట్లు ఇస్తూనే ఉంది. కొన్ని నెలల క్రితం వాట్సాప్ ఛానెల్ ఫీచర్‌ని ప్రారంభించింది. దీని ద్వారా యూజర్లు తమ ఫేవరెట్ కంటెంట్ క్రియేటర్లు, సెలబ్రిటీలతో కనెక్ట్ అవ్వవచ్చు. ఇప్పుడు కంపెనీ దీనికి మరిన్ని ఫీచర్లను యాడ్ చేయనుంది. ఒకవేళ మీకు వాట్సాప్ ఛానెల్ ఉంటే మీకు ఈ ఫీచర్లు బాగా ఉపయోగపడతాయి.


Wabetainfo కథనం ప్రకారం... వాట్సాప్ ఛానెల్స్‌కు మూడు కొత్త ఫీచర్లు రానున్నాయి. అవే ఛానెల్ అలెర్ట్, హైడ్ నేవిగేషన్ లెవల్, డేట్ ద్వారా మెసేజెస్ సెర్చ్ చేయడం. ‘ఛానెల్ ఇన్ఫో’లోకి వెళ్లి ఛానెల్ అలెర్ట్స్ చూడవచ్చు. ఇక్కడ మీకు అప్‌డేట్స్ కూడా కనిపిస్తాయి. ఒకవేళ మీ ఛానెల్ ఏదైనా రూల్స్ బ్రేక్ చేసిందా? అన్నది కూడా అక్కడ తెలుస్తుంది.


దీంతోపాటు కంపెనీ మరో కొత్త ఫీచర్‌ను కూడా తీసుకురానుంది. అదే కిందకి స్క్రోల్ చేసేటప్పుడు నేవిగేషన్ లెవల్‌ని హైడ్ చేయడం. దీంతోపాటు మీరు మెసేజెస్‌ని డేట్ల వారీగా కూడా తెలుసుకునే అవకాశం ఉంది.


ప్రస్తుతానికి ఈ అప్‌డేట్లు వాట్సాప్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉన్నాయి. త్వరలో అందరు యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీకు దీనికి సంబంధించి అప్‌డేట్లు కావాలి అనుకుంటే వాట్సాప్ బీటా ప్రోగ్రాంకు ఎన్‌రోల్ చేసుకోవాల్సి ఉంటుంది.


వాట్సాప్ ఇటీవలే మరో కొత్త ఫీచర్‌పై కూడా పని చేయడం ప్రారంభించింది. దీని ద్వారా ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లో సీక్రెట్ ఛాట్లను కూడా హైడ్ చేయవచ్చు. వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్ లేటెస్ట్ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ చూడవచ్చు. ఇది అందుబాటులోకి వస్తే మీరు హైడ్ చేసిన ఛాట్లు సీక్రెట్ కోడ్ ఎంటర్ చేస్తేనే కనిపిస్తాయి. ప్రస్తుతం వాట్సాప్‌ యాప్ ఓపెన్ చేసి మెయిన్ స్క్రీన్‌ను కిందకి స్వైప్ చేస్తే పైన మనం హైడ్ చేసిన ఛాట్లు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు వాట్సాప్ తీసుకుకురానున్న ఫీచర్ ద్వారా సీక్రెట్ కోడ్ ఎంటర్ చేసినప్పుడు మాత్రమే వాటిని యాక్సెస్ చేయడం సాధ్యం అవుతుంది. దీంతోపాటు వాట్సాప్ ఛానెల్స్‌కు యూజర్ నేమ్ ఫీచర్ కూడా అందుబాటులోకి రానుంది.


వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.23.24.20 బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే మెసేజింగ్ యాప్‌లో సీక్రెట్ కోడ్‌ను సెట్ చేసుకోవచ్చు. దీని కోసం లాక్డ్ ఛాట్స్ లిస్ట్ ఓపెన్ చేసి పైన కనిపిస్తున్న త్రీ డాట్ మెనూ ఓపెన్ చేయాలి. అక్కగ ఛాట్ లాక్ సెట్టింగ్స్‌కు వెళ్లి అందులో ‘హైడ్ లాక్డ్ ఛాట్స్’ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం మీరు ఒక సీక్రెట్ కోడ్‌ను కూడా ఎంటర్ చేయాలి. అయితే ఆ సీక్రెట్ కోడ్‌ను మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవడం ముఖ్యం. ఎందుకంటే తర్వాత మీరు ఎప్పుడైనా కోడ్ మర్చిపోయి రీసెట్ చేయాలనుకున్నప్పుడు లాక్ చేసిన ఛాట్లు అన్నీ క్లియర్ అయిపోతాయని గుర్తుపెట్టుకోండి.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!