మెసేజింగ్ యాప్ వాట్సాప్ రానున్న కాలంలో యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతుంది. మెసేజింగ్ యాప్‌లో యానిమేటెడ్ అవతార్ ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. ఈ ఫీచర్‌ను ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా కోసం డెవలప్ చేస్తున్నారు. WABetaInfo కథనం ప్రకారం వాట్సాప్ తీసుకురానున్న ఈ ఫీచర్ వినియోగదారుల ఇంటరాక్షన్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అదే వాట్సాప్ యానిమేటెడ్ ఫీచర్.


ఈ అప్‌డేట్ కోసం కంపెనీ రెండు ప్రధాన కరెక్షన్‌లను ప్రకటించినట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. మొదటి కరెక్షన్ ఏమిటంటే ఫొటో తీయడం ద్వారా మీ అవతార్‌ను కాన్ఫిగర్ చేయగల సామర్థ్యం ఉంటుంది. దీంతో అవతార్ ప్రక్రియను ఆటోమేట్ అవుతుంది. రెండోది యాప్ సెట్టింగ్స్ నుంచి నేరుగా వారి అవతార్ కాన్ఫిగరేషన్‌ను సెట్ చేసిన వినియోగదారులందరికీ కొత్త అవతార్ల కలెక్షన్ (వాట్సాప్ యానిమేటెడ్ అవతార్స్) ఆటోమేటిక్‌గా రోల్ అవుట్ అవుతుంది.


వాట్సాప్‌లో అవతార్ ఎలా సెట్ చేసుకోవాలి?
దీని కోసం ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ అవతార్ సెక్షన్‌లో ‘క్రియేట్ యువర్ అవతార్‌’ను ఎంచుకోవాలి. ఆపై మీ ఆప్షన్ ప్రకారం దాన్ని కస్టమైజ్ చేసుకోండి. ఇప్పుడు చేసిన మార్పులను సేవ్ చేయండి. మీరు ఈ ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే మీ కాంటాక్ట్స్‌తో షేర్ చేయడానికి మీ అవతార్‌కి సంబంధించిన కస్టమైజ్డ్ స్టిక్కర్ ప్యాక్‌ను పొందుతారు.


ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వాట్సాప్‌ మెసేజింగ్ యాప్‌ని ఉపయోగిస్తున్నారు. ఇది చాలా పాపులర్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. ఈ యాప్ ద్వారా మీ కాంటాక్ట్‌లకు మెసేజ్‌లకు మాత్రమే కాకుండా ఫోటోలు, వీడియోలను కూడా పంపవచ్చు. ఇప్పుడు యాప్‌లో మీడియా షేరింగ్ కూడా జరుగుతుంది కాబట్టి యాప్ చాలా స్టోరేజీని తీసుకుంటుంది. కొన్ని సార్లు మీ స్మార్ట్ ఫోన్‌లో ఉండే స్టోరేజ్ చాలా వేగంగా ఫుల్ అయిపోతుంది. కానీ చాలా సింపుల్‌గా ఈ స్టోరేజ్ స్పేస్‌ను ఖాళీ చేయవచ్చు.


మీ ఫోన్‌లో ఏదైనా డేటాను తొలగించే ముందు ఆ డేటా మీ ఫోన్‌లో ఎంత స్టోరేజ్‌ను తీసుకుందో చెక్ చేయండి.


1. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ తెరవండి.
2. ఇప్పుడు అందులో సెట్టింగ్స్‌కు వెళ్లండి.
3. దీని తర్వాత అక్కడ కనిపిస్తున్న స్టోరేజ్, డేటాపై క్లిక్ చేయండి.
4. ఇక్కడ Manage storage సెక్షన్‌కు వెళ్లండి.
5. మీ స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్ మీడియా ఎంత స్టోరేజ్‌ను ఉపయోగించిందో కూడా ఇక్కడ చూడవచ్చు.










Read Also: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం, ఇంతకీ ఏం జరిగింది?


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial