Whatsapp Big Files :  వాట్సాప్‌లో పెద్ద వీడియో ఫైల్స్ షేర్ చేసుకోవడం పెద్ద సమస్య అయిపోతోంది. కేవ‌లం 100 ఎంబీ లోపు ఫైల్స్‌ను మాత్ర‌మే పంపించుకునే వెసులుబాటు ఉంది. దీంతో చాలామంది యూజ‌ర్లు పెద్ద ఫైల్స్‌ను పంపించేందుకు ఇతర మెసెజింగ్ యాప్స్‌పై ఆధారపడుతున్నారు.  ఈ స‌మ‌స్య‌ను గ‌మ‌నించిన వాట్సాప్ స‌రికొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2 జీబీ వ‌ర‌కు సైజ్ క‌లిగిన ఫైల్స్‌ను పంపించుకునే ఛాన్స్ ఇచ్చింది. రెండు జీబీ అంటే ఓ సినిమా మొత్తం వీడియో అంత పంపించుకోవచ్చు. 


నంబర్ సేవ్ చేయకుండా వాట్సాప్‌లో మెసేజ్ చేయండిలా - నిమిషం కూడా పట్టదు!


2 జీబీ వ‌ర‌కు ఫైల్స్‌ను పంపించుకునే స‌దుపాయాన్ని తీసుకొస్తున్నామ‌ని  రెండు నెలల కిందట వాట్సాప్ ప్ర‌క‌టించింది. అన్న‌ట్టుగానే ఈ ఫీచ‌ర్‌ను అర్జెంటీనాలో తీసుకొచ్చి ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రీక్షించింది. తాజాగా ఈ ఫీచ‌ర్‌ను ఇత‌ర ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ యూజ‌ర్లు ఎవ‌రైనా ఈ స‌దుపాయాన్ని వినియోగించుకోవ‌చ్చు. కాక‌పోతే ఇది ఒకేసారి అంద‌రికీ అందుబాటులోకి రాలేదు. ప్ర‌స్తుతానికి కొంత‌మంది యూజ‌ర్లు మాత్ర‌మే ఈ ఫీచ‌ర్‌ను వినియోగించుకునే అవ‌కాశం ఉంది. మిగిలిన యూజ‌ర్ల‌కు త్వ‌ర‌లోనే ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది.


వాట్సాప్ కొత్త ఫీచర్ వచ్చేస్తుంది - ఇక డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అవసరం కూడా ఉండదు - నేరుగా మెసేజ్‌నే!


ఈ సదుపాయం మీకు అందుబాటులోకి వచ్చిందో రాలేదో తెలుసుకోవాలంటే  మీ వాట్సాప్ ఓపెన్ చేయండి.. ఆ త‌ర్వాత ఏదైనా ఓ కాంటాక్ట్ నంబ‌ర్‌కు 100 ఎంబీ కంటే ఎక్కువ సైజ్ ఉన్న వీడియోను డాక్యుమెంట్ రూపంలో అటాచ్ చేయండి. అప్పుడు ఆ వీడియో అప్‌లోడ్ అయితే మీకు ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చిన‌ట్టే. ఒక‌వేళ అప్‌లోడింగ్ ఫెయిలైతే.. ఈ ఫీచ‌ర్ కోసం మీరు ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే . అందరికీ ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తే వాట్సాప్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 


గుట్టుగా గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు - వాట్సాప్ కొత్త ఫీచర్ గురించి తెలుసా ?


వాట్సాప్ ఇటీవల  కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆడియో, వీడియో కాల్స్‌కు ప్రత్యేకమైన ఫంక్షన్ బార్‌ను ఇందులో అందించారు. చాట్స్, స్టోరీస్, పీపుల్ ట్యాబ్ పక్కనే ఈ కొత్త ట్యాబ్ కూడా కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయగానే మీ మెసెంజర్‌లోని కాంటాక్ట్స్ అక్కడ కనిపిస్తాయి. పక్కనే ఆడియో, వీడియో కాల్స్ ఆప్షన్లు కూడా ఉండనున్నాయి.