యాపిల్ సోమవారం జరిగిన WWDC 2022 కీనోట్‌లో వాచ్ఓఎస్ 9ను కూడా లాంచ్ చేసింది. దీని ద్వారా యాపిల్ వాచ్ యూజర్లు హెల్త్, ఫిట్‌నెస్‌ను మరింత మెరుగ్గా ట్రాక్ చేయవచ్చు. యాపిల్ వాచ్ఓఎస్ 9 ద్వారా మెడికేషన్స్ యాప్ కూడా అందుబాటులోకి వచ్చింది. కొత్త వర్కవుట్ ఫీచర్లను కూడా యాపిల్ తీసుకువచ్చింది.


యాపిల్ డెవలపర్ ప్రోగ్రాంలో భాగమైన వారికి వాచ్ ఓఎస్ 9 అప్‌డేట్ మొదట రానుంది. వాచ్ఓఎస్ 9 పబ్లిక్ బీటా వినియోగదారులకు వచ్చే నెలలో లాంచ్ కానుంది. ఆ తర్వాత ఫ్రీ సాఫ్ట్ వేర్ అప్‌డేట్ ద్వారా వాచ్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. యాపిల్ వాచ్ సిరీస్ 4 లేదా ఆ తర్వాతి వెర్షన్ వాచ్‌లు ఉపయోగించేవారికి ఈ అప్‌డేట్ రానుంది. అయితే పెయిర్ అయ్యే ఫోన్‌లో ఐవోఎస్ 16 ఆపరేటింగ్ సిస్టం ఉండాలి.


వాచ్ఓఎస్ 9 ఫీచర్లు
ఫిట్‌నెస్, హెల్త్ ట్రాకింగ్‌లను యాపిల్ ఈ అప్‌డేట్ ద్వారా ఎక్స్‌ప్యాండ్ చేసింది. వినియోగదారులు తమ హెల్త్ రిపోర్టును పీడీఎఫ్ ద్వారా కూడా పొందవచ్చు. వాచ్ఓఎస్ 9 ద్వారా నాలుగు కొత్త వాచ్ ఫేసెస్‌ను పొందవచ్చు. వర్కవుట్ టైప్స్, హార్ట్ రేట్ జోన్లలో కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు కస్టం వర్కవుట్ మోడ్ కూడా ఉంది. అంటే తమ వర్కవుట్‌కు సంబంధించిన అలెర్ట్స్ వినియోగదారులు యాడ్ చేసుకోవచ్చు


స్లీప్ ట్రాకింగ్‌ను కూడా యాపిల్ ఈ ఆపరేటింగ్ సిస్టం ద్వారా అప్‌డేట్ చేసింది. ఆర్ఈఎం, కోర్, డీప్ స్లీప్ స్టేజ్‌లను కూడా ట్రాక్ చేసే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. మెడికేషన్స్ యాప్ ద్వారా వినియోగదారులు తాము వేసుకోవాల్సిన మందులు, విటమిన్లు, సప్లిమెంట్ల వివరాలను వాచ్ నుంచే పొందవచ్చు.


డేట్, టైం, లొకేషన్, ట్యాగ్స్, నోట్స్‌ను యాడ్ చేసుకోవచ్చు, ఎడిట్ కూడా చేసుకోవచ్చు. కొత్త క్యాలెండర్ యాప్ ద్వారా ఈవెంట్స్‌ను వాచ్ నుంచే క్రియేట్ చేయవచ్చు. అత్యంత కీలకమైన హెల్త్ డేటాను పూర్తిగా ఎన్‌క్రిప్ట్ చేయనున్నారు. వినియోగదారుల పర్మిషన్ లేకుండా ఎవరికీ అది షేర్ అవ్వదు.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!