Watch Viral Video : ప్రపంచంలోని అనేక సంస్కృతులలో వివాహాలు చాలా ముఖ్యమైనవి. మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన వాటిల్లో ఒకటిగా వివాహాన్ని పరిగణిస్తారు. వివిధ ప్రాంతాల వారి వారి ఆచారాల్లో వివాహాలు జరుపుకుంటారు.కొన్ని ప్రాంతాల్లో అయితే వింతైన వివాహ వేడుకలు జరుగుతాయి. ఫ్రాన్స్‌లో వధువు వరుడు పెళ్లిలో మిగిలిపోయిన వస్తువులు, చెత్త అందుబాటులో ఉన్న మురికి పదార్థాలతో ఓ డ్రింక్ తయారుచేస్తారు.  దానిని వధువరులు తాగుతారు. ఇదిలా ఉంటే దక్షిణ కొరియాలో మొదటి రాత్రికి సిద్ధం చేయడానికి చనిపోయిన చేపతో వరుడి పాదాలను కొట్టడం కొంతమందికి ఆచారం. 


విచిత్ర వివాహాలు 


అయితే భారతీయ వివాహ వేడుకలు చాలా వైభవంగా ఉంటాయి. ఆచారాలు, సంప్రదాయాలు వివాహ కార్యక్రమాలను అత్యంత ఆహ్లాదకరంగా మారుస్తాయి. అయితే కొన్నిసార్లు ప్రజలు వినోదం కోసం విచిత్రమైన విధానాలు అవలంభిస్తారు. విచిత్రమైన వివాహ ఆచారాలను చూపించే వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం తరచుగా చూస్తుంటాం. అయితే మీరు అంత తేలికగా మరచిపోలేని అలాంటి మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


వైరల్ వీడియో 


ఈ వీడియోలో ఉన్న వరుడు సిద్ధార్థ్ సోనావనే, అతనికి 25 ఏళ్లుంటాయని తెలుస్తోంది. మరోవైపు వధువు శ్రుతి ఔసర్మల్ వయసు 23 ఏళ్లు. తెల్లటి దుస్తులు ధరించిన యువ జంట ఒకరి మెడలో మరొకరు పాములను దండలుగా వేసుకుని పెళ్లి చేసుకున్నట్లు వీడియో కనిపిస్తుంది. ఈ వీడియోలో వధువు పొడవాటి పామును, వరుడు భారీ కొండచిలువను పట్టుకున్నారు. ఆశ్చర్యకరంగా పాములను పట్టుకున్నప్పుడు వధువు కానీ, వరుడు కానీ భయపడినట్లు కనిపించడం లేదు. ఈ జంట మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన వారని, వారు స్థానిక వన్యప్రాణి విభాగం ఉద్యోగులని తెలుస్తోంది. 



ఫొటోగ్రాఫర్ లేడని పెళ్లికి నో


పెళ్లి కోసం అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెళ్లి కొడుకు ఊరేగింపు నుంచి రాగానే వరమాల కార్యక్రమాన్ని కూడా చేసేశారు. అయితే, పెళ్లి కూతురుకు దరిదాపుల్లో ఎక్కడా ఫొటోగ్రాఫర్ కనిపించలేదు. దీంతో అక్కడికక్కడే వరుడిని నిలదీసింది. ఫొటోగ్రాఫర్ ఎక్కడ అని అడిగింది. రాలేదని, అతడు సమాధానం చెప్పాడు. అంతే, ఆమె తనకు ఆ పెళ్లి వద్దని వెంటనే రద్దు చేసుకుంది. వెంటనే పీటల మీద నుంచి దిగిపోయి, కోపంతో పక్కింటికి వెళ్లిపోయింది. 


ఆమెను పెళ్లి చేసుకోవాలని కుటుంబికులు చాలాసేపు బతిమాలారు. పెళ్లి గురించి పట్టించుకోని వ్యక్తి.. భవిష్యత్తులో తన బాధ్యతలను ఎలా చూసుకుంటాడని సూటిగా ప్రశ్నించింది. అప్పటికీ పెద్దలు ఆమెకు ఎంతో చెప్పిచూశారు. తన నిర్ణయాన్ని ఇదేనని వధువు చెప్పేసింది. దీంతో పెద్దలు ఆ పెళ్లిని రద్దు చేస్తు్న్నట్లు ప్రకటించారు. దీంతో వరుడి కుటుంబికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల మధ్య పోలీసులు రాజీకుదిర్చారు. పెళ్లి ఖర్చులను తిరిగి ఇచ్చేస్తామని వధువు కుటుంబికులు చెప్పడంతో వివాదానికి తెరపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దెహత్ జిల్లాలోని మంగలపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పెళ్లి కొడుకు కుటుంబికులు వీడియో, ఫొటోగ్రాఫర్‌ను ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ గొడవ జరిగిందని పోలీసులు వెల్లడించారు.