IBPS RRB 2022 Notification : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) RRB 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్ఆర్బీ గ్రూప్ A ఆఫీసర్ స్కేల్ I, II, III, గ్రూప్ B ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) నోటిఫికేషన్ ను సోమవారం అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం IBPS RRB దరఖాస్తు ఫారమ్ జూన్ 7 నుంచి 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది.



  • మొత్తం ఉద్యోగాలు: 8081 ఉద్యోగాలకు నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలైంది.

  • అధికారిక వెబ్‌సైట్: www.ibps.in.


IBPS RRB 2022 ఖాళీల వివరాలు 



  1. IBPS RRB ఆఫీస్ అసిస్టెంట్- 4483 ఖాళీలు

  2. IBPS RRB ఆఫీసర్ స్కేల్- I- 2676 ఖాళీలు

  3. IBPS RRB ఆఫీసర్ స్కేల్- II- 842  ఖాళీలు

  4. IBPS RRB ఆఫీసర్ స్కేల్- III- 80 ఖాళీలు 


IBPS అధికారిక వెబ్‌సైట్‌లో అర్హత ప్రమాణాలు, పరీక్ష విధానం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచింది. CRP RRB - XI కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే దరఖాస్తుదారులు IBPS వెబ్‌సైట్‌లో పేర్కొన్న విధంగా నిర్ణీత తేదీలోపు కనీస అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.


IBPS RRB 2022 ముఖ్య తేదీలు 



  • IBPS RRB రిజిస్ట్రేషన్ , ఎడిట్, మోడిఫికేషన్ గడువు  ---  జూన్ 7 నుంచి జూన్ 27, 2022 వరకు  

  • దరఖాస్తు రుసుము  చెల్లించాల్సిన తేదీలు                   --- జూన్ 7 నుంచి 27, 2022 వరకు

  • ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్                                         --- జులై 18 నుంచి 23, 2022

  • IBPS RRB ప్రిలిమ్స్ పరీక్ష                               --- ఆగస్టు 2022

  • పరీక్ష ఫలితాలు                                              --- సెప్టెంబర్ 2022 

  • IBPS RRB మెయిన్స్                                     --- సెప్టెంబర్ లేదా నవంబర్ 2022


దరఖాస్తు చేసే ముందు 



  • IBPS RRB 2022 దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తి చదివి, అందులో పేర్కొన్న పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. 

  • దరఖాస్తుదారులు IBPS పేర్కొన్న అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.

  • రిజిస్ట్రేషన్ నంబర్,  పాస్‌వర్డ్‌ను భద్రపరుచుకోవాలి. అభ్యర్థులు తప్పనిసరిగా పనిచేసే మొబైల్ నంబర్, ఇమెయిల్ IDని కలిగి ఉండాలి.

  • అభ్యర్థులు తప్పనిసరిగా స్కాన్ చేసిన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి

  • పాస్‌పోర్ట్ ఫొటో , సైన్(నిర్దేశిత కేబీల్లో) 

  • ఎడమ చేతి థంబ్ ఇంప్రెషన్ 


IBPS RRB రిక్రూట్‌మెంట్ గ్రూప్ A ఆఫీసర్స్ (స్కేల్-I, II & III) ఇంటర్వ్యూలు ఇదే ప్రక్రియలో NABARD, IBPS సహాయంతో రిజనల్ రూరల్ బ్యాంక్స్ నవంబర్ 2022 లో నిర్వహిస్తాయి.