ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ వూ మనదేశంలో కొత్త ప్రీమియం స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. దీని ధర బడ్జెట్ రేంజ్‌లోనే ఉండటం విశేషం. 32 అంగుళాల డిస్‌ప్లేను ఇందులో అందించారు. 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ కూడా ఇందులో ఉంది. ఈ టీవీ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. 20W సౌండ్ అవుట్‌పుట్‌ను వీటి స్పీకర్లు అందించనున్నాయి. డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఇందులో ఉంది. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.


వూ ప్రీమియం 32 స్మార్ట్ టీవీ ధర
దీని ధరను రూ.12,999గా నిర్ణయించారు. అయితే ఇది ప్రారంభ ధర మాత్రమేనని కంపెనీ అంటోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీలు కొనుగోలు చేయవచ్చు. కొన్ని ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా క్యాష్‌బ్యాక్ కూడా లభించనుంది. ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుపై ఒక సంవత్సరం వారంటీ కూడా లభించనుంది.


వూ ప్రీమియం 32 స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 32 అంగుళాల డిస్‌ప్లే ఉండనుంది. దీని వ్యూయింగ్ యాంగిల్ 178 డిగ్రీలుగానూ, రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ ఉండనుంది. ఇందులో ఫ్రేమ్ లెస్ డిజైన్‌ను కంపెనీ అందించడం విశేషం. ఈ తాజా వూ స్మార్ట్ టీవీలో అడాప్టివ్ కాంట్రాస్ట్ ఫీచర్ కూడా ఉంది. 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌పై ఈ టీవీ పనిచేయనుంది. 1 జీబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టం కూడా ఇందులో ఉంది.


ఇందులో 20W స్పీకర్లను అందించారు. డాల్బీ ఆడియోను ఇది సపోర్ట్ చేయనుంది. డీటీఎస్ ట్రూసరౌండ్ టెక్నాలజీని ఇందులో అందించారు. ఈ టీవీకి ఎక్స్‌టర్నల్ సౌండ్ సిస్టంను కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. వైఫై, రెండు యూఎస్‌బీ పోర్టులు, రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు, ఒక ఏవీ ఇన్‌పుట్, ఒక ఆడియో జాక్ కూడా ఇందులో ఉన్నాయి.


మ్యూజిక్ వినాలనుకున్నప్పుడు కేవలం ఆడియో మోడ్ కూడా ఇందులో ఉంది. టీవీతో పాటు ఐఆర్ రిమోట్‌ను కూడా అందించనున్నారు. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, బ్రౌజర్, యాప్స్‌కు ప్రత్యేకమైన కీస్ ఇందులో అందించనున్నారు.


ఇందులో ఉన్న సినిమా నైట్ మోడ్ ద్వారా వినియోగదారులు కంటెంట్‌ను తక్కువ కాంతిలో కూడా చూడవచ్చు. దీని మందం 0.86 సెంటీమీటర్లు కాగా.. స్టాండ్ లేకుండా టీవీ బరువు 3.6 కేజీలుగా ఉండనుంది.