వొడాఫోన్ ఐడియా మనదేశంలో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. వీటిలో మొదటిది రూ.198 ప్లాన్ కాగా, రెండోది రూ.204 ప్లాన్. ఈ రెండు ప్లాన్లతోనూ 500 ఎంబీ డేటా రానుంది. ఈ కొత్త ప్లాన్లతో అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ ఎస్ఎంఎస్ వంటివి ఏమీ లభించవు. మరి ఈ ప్లాన్ల లాభాలు ఏంటి?


వీఐ రూ.198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లాభాలు
వొడాఫోన్ ఐడియా రూ.198 ప్లాన్‌తో రూ.198 టాక్ టైం లభించనుంది. దీని వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. లోకల్, నేషనల్ కాల్స్‌కు సెకనుకు 2.5 పైసల కాల్ ఛార్జీలు వర్తిస్తాయి. ఎటువంటి ఉచిత ఎస్ఎంఎస్ లాభాలు కూడా రావు. ఎస్‌ఎంఎస్‌లకు స్టాండర్డ్ ఛార్జీలు వసూలు చేస్తారు.


వీఐ రూ.204 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లాభాలు
ఈ ప్లాన్ ద్వారా రూ.204 టాక్‌టైం, 500 ఎంబీ డేటా లభించనుంది. మిగతా లాభాలన్నీ పై ప్లాన్ తరహాలోనే ఉంటాయి. దీని ద్వారా వొడాఫోన్ అన్‌లిమిటెడ్ నైట్ డేటా యాక్సెస్ కూడా లభించనుంది. సాధారణంగా వొడాఫోన్ బింజ్ నైట్ బెనిఫిట్ ద్వారా రాత్రి 12 గంటల నుంచి పొద్దున్న ఆరు గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటా యాక్సెస్ అందిస్తుంది.


ఈ ప్లాన్లు ప్రస్తుతం ముంబై, గుజరాత్ సర్కిల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు రూ.17 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్ కూడా ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాన్‌తో పైన తెలిపిన బింజ్ నైట్ బెనిఫిట్ లభించనుంది. ఈ ప్లాన్ మాత్రం దేశం అంతా అందుబాటులో ఉంది.


రూ.299 ఆ పైన ప్లాన్లతో రీఛార్జ్ చేస్తే బింజ్ ఆల్ నైట్, వీకెండ్ డేటా రోల్ఓవర్, డేటా డిలైట్, హీరో అన్‌లిమిటెడ్ డైలీ డేటా లాభాలు లభించనున్నాయి. వొడాఫోన్ ఐడియా అన్‌లిమిటెడ్ ప్లాన్లు రూ.129 నుంచి ప్రారంభం కానున్నాయి.


మరోవైపు వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. యూజర్లు ఈజీగా వాట్సాప్ సేవలను అందుకునేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు కొత్త ఫీచర్లు అమల్లోకి తీసుకొచ్చిన వాట్సాప్, త్వరలో మరో ముఖ్యమైన ఫీచర్ ను వినియోగదారులకు పరిచయం చేయబోతోంది. ఇప్పటి వరకు వెబ్ వాట్సాప్ వినియోగించాలంటే కచ్చితంగా వాట్సాప్ వాడుతున్న మొబైల్ నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాతే వెబ్ లోకి లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది.


ఒక్కోసారి ఫోన్ లో కెమెరా  పని చేయకపోయినా, పగిలిపోయినా వెబ్ లాగిన్ చేయడం కష్టం అవుతుంది. ఇలాంటి సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తోంది వాట్సాప్. QR కోడ్ స్కాన్ అవసరం లేకుండా నేరుగా వాట్సాప్ కు వినియోగిస్తున్న ఫోన్ నెంబర్ ఆధారంగా లాగిన్ అయ్యేలా కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తేబోతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పై మెటా యాజమాన్యం పరీక్షలు జరుపుతోంది. 


Read Also: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం, ఇంతకీ ఏం జరిగింది?


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial