వివో వై75 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో ఫ్లాగ్ షిప్ తరహా ఫ్లాట్ డిజైన్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 5జీ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు.
వివో వై75 5జీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను రూ.21,990గా నిర్ణయించారు. గ్లోయింగ్ గెలాక్సీ, స్టార్‌లైట్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. వివో ఇండియా ఈ-స్టోర్, ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంల్లో ఈ ఫోన్ సేల్ జరగనుంది.
వివో వై75 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌లో ఉపయోగించని డేటా నుంచి 4 జీబీని ర్యామ్‌గా వాడుకోవచ్చు. అంటే మొత్తంగా 12 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉండనుందన్న మాట. ఇక స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ బొకే కెమెరా కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇందులో వివో ఎక్స్‌ట్రీమ్ నైట్ ఏఐ బేస్డ్ అల్గారిథంను కూడా అందించారు.
5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ వీ5.1, వైఫై, జీపీఎస్, ఎఫ్ఎం రేడియో సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.82 సెంటీమీటర్లుగానూ, బరువు 188 గ్రాములుగానూ ఉంది.