వివో వై54ఎస్ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఈ కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను అందించారు. వాటర్‌డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 128 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ రివర్స్ చార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.
వివో వై54ఎస్ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధర 1,699 యువాన్లుగా(సుమారు రూ.19,800) ఉంది. లేక్ బ్లూ, టైటానియం ఎంప్టీ గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
వివో వై54ఎస్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 1.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.51 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ టు బాడీ రేషియో 89 శాతంగా ఉంది.
మీడియాటెక్ హీలియో 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఫేస్ ఐడీ ఫీచర్ కూడా ఉంది. 5జీ, బ్లూటూత్ వీ5.1, 3.5 ఎంఎం ఆడియోజాక్, జీపీఎస్, మైక్రో యూఎస్‌బీ పోర్టు, ఓటీజీ, వైఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. గ్రావిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్ కూడా ఇందులో ఉన్నాయి. ఎస్‌బీసీ, ఏఏసీ, ఎల్‌డీఏసీ, యాప్ట్ఎక్స్ హెచ్‌డీ, యాప్ట్ఎక్స్ కోడెక్ కూడా ఇందులో ఉన్నాయి.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 188.4 గ్రాములుగా ఉంది.
Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!
Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!