ప్రముఖ స్మార్ట్ ఫోన్ల కంపెనీ వివో నుంచి సరికొత్త ఫోన్ భారతదేశంలో లాంచ్ కానుంది. వివో వై 53 ఎస్ (Vivo Y53s) స్మార్ట్ ఫోన్‌ను ఆగస్టు 9న ఇండియాలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ధ్రువీకరించింది. గత నెలలో వియత్నాంలో విడుదలైన ఈ ఫోన్.. తాజాగా భారత మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. వాటర్‌ డ్రాప్ స్టైల్ నాచ్ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా వంటి ఫీచర్లతో వస్తుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కూడా ఉన్నాయి. వివో వై 53 ఎస్ ప్రస్తుతానికి 4జీ ఆప్షన్‌లోనే వస్తున్నట్లు తెలుస్తోంది.  


రూ.23 వేల లోపే ధర..
వివో వై 53 ఎస్ ఫోన్‌కు సంబంధించిన ధర, ఫీచర్ల వివరాలు అధికారికంగా విడుదల కాలేదు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లపై పలు లీకులు వస్తున్నాయి. వీటి ప్రకారం 8 జీబీ ర్యామ్+128 స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,900గా ఉండనుంది. ఇవి డీప్ సీ బ్లూ, ఫెంటాస్టిక్ రెయిన్‌బో కలర్ ఆప్షన్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 


Also Read: Noise Colorfit Pro 3 Launch: నాయిస్ నుంచి స్మార్ట్ వాచ్ రిలీజ్.. సరికొత్తగా హ్యాండ్ వాష్ రిమైండర్ ఫీచర్



వియత్నాంలో విడుదలైన మోడల్‌లో ఉన్న ఫీచర్లే ఈ పోన్ లోనూ ఉండనున్నట్లు తెలుస్తోంది. వాటి ప్రకారం చూసుకుంటే.. డ్యూయల్ సిమ్ (నానో) వివో వై 53 ఎస్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. ఇందులో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే అందించారు. రిఫ్రెష్ రేట్ 60Hzగా, యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండనుంది. స్క్రీన్ రిజల్యూషన్ 1,080 x 2,400 పిక్సెల్స్‌గా ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ అందించారు. ఈ ఫోన్ 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. 



వివో వై 53 ఎస్ ఫోన్‌ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ80 ఎస్ఓసీ ప్రాసెసర్‌పై పనిచేయనుంది. దీనిలో మొత్తం మూడు కెమెరాలు ఉంటాయి. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌లతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా అందించారు. సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంటుంది. 


128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కూడా ఇందులో లభిస్తుంది. కనెక్టివిటీ ఫీచర్లుగా 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ 5.0, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, జీపీఎస్ ఉన్నాయి. ఫోన్ పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఈ ఫోన్ 190 గ్రాముల బరువు ఉండనుంది. 


Also Read: Realme Narzo 30: రియల్‌మీ నార్జో 30లో కొత్త వేరియంట్.. రెండు ఆకర్షణీయమైన రంగులలో లభ్యం