Vivo X90 దేశీయ మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ లో భాగంగా, Vivo X90, Vivo X90 Pro పేరుతో రెండు స్మార్ట్ ఫోన్లు అడుగు పెట్టాయి. ఇప్పటకే ప్రపంచవ్యాప్తంగా ఈ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ప్రస్తుతం భారత్ మార్కెట్లోకి ప్రవేశించాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లను కలిగి ఉన్నాయి. వీటి ప్రీ బుక్స్ ఇప్పటికే మొదలుకాగా, మే 5 నుంచి సేల్ కు రానున్నాయి.   






Vivo X90 సిరీస్ ఫోన్ల స్పెసిఫికేషన్లు


ఈ రెండు ఫోన్లకు సంబంధించి కెమెరాలలు, బ్యాటరీ, చార్జింగ్ ఫీచర్లు మినహా ఇతర స్పెసిఫికేషన్లన్నీ దాదాపు ఒకేలా ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్ల  6.78 అంగుళాల ఫుల్ హెచ్‍డీ+ అమొలెడ్ డి స్‍ప్లేను కలిగి ఉన్నాయి. 120 Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 1300 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ను కలిగి ఉన్నాయి. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమన్సిటీ 9200 ప్రాసెసర్‌ ను కలిగి ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 13తో రన్ అవుతాయి.   


Vivo X90 సిరీస్ ఫోన్ల కెమెరా ప్రత్యేకతలు


ఇక కెమెరాల విషయానికి వస్తే Vivo X90 వెనుక మూడు కెమెరాలను కలిగి ఉంది. 50 మెగా పిక్సెల్ సోనీ IMX866 OIS ప్రైమరీ, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్, 12 మెగాపిక్సెల్ పోట్రయిట్ కెమెరాల సెటెప్ తో వస్తుంది. Vivo X90  Proలో వెనుక 1  అంగుళం పరిమాణంలో ఉండే Sony IMX989 లెన్స్‌ తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. 50 మెగాపిక్సెల్ పోట్రయిట్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలను కలిగి ఉంది. ఈ రెండు ఫోన్లు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలతో వస్తున్నాయి.  


Vivo X90 సిరీస్ ఫోన్ల బ్యాటరీ ప్రత్యేకతలు


Vivo X90లో 4810mAh బ్యాటరీ ఉంటుంది. 120W  వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. Vivo X90  Pro 4870mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 120W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్లెస్ చార్జింగ్‍కు సపోర్టు చేస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 5జీ,  డ్యుయల్ వైఫై6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్ ను కలిగి ఉన్నాయి. డ్యుయల్ స్టీరియో స్పీకర్లతో చక్కటి సౌండ్ అనుభూతిని పొందే అవకాశం ఉంటుంది.   


Vivo X90 సిరీస్ ఫోన్ల ధర ఎంత? ఎక్కడ లభిస్తాయి?


Vivo X90  ఫోన్లు రెండు వేరియంట్లలో విడుదల అయ్యింది.  Vivo X90  8 జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.59,999గా కంపెనీ నిర్ణయించింది. Vivo X90 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ధర రూ.63,999గా ఫిక్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ అస్ట్రాయిడ్ బ్లాక్, బ్రీజ్ బ్లూ కలర్ ఆప్షన్‍లలో వచ్చింది. అటు Vivo X90 Pro ప్రో ఫోన్ ఒకే వేరియంట్‍లో అందుబాటులోకి వచ్చింది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ధర  రూ.84,999గా నిర్ణయించింది. ఈ ఫోన్ లెజండరీ బ్లాక్ కలర్‌లో లభిస్తుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ప్రస్తుతం ఫ్లిప్‍కార్ట్, వివో వెబ్‍సైట్‍లో ప్రీ-బుకింగ్‍కు అందుబాటులో ఉన్నాయి. మే 5న ఈ రెండు ఫోన్లు ఓపెన్ సేల్‍కు రానున్నాయి. ఈ సందర్భంగా రెండు స్మార్ట్ ఫోన్లపై స్పెషల్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.


Read Also: అద్భుతం, 6G ద్వారా అల్ట్రా హై స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించిన చైనా - 5Gకి తోపు ఇది!