Vivo X80 Series Launch: వివో ఎక్స్80 సిరీస్ ఫోన్లు మనదేశంలో ఏప్రిల్‌లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో వివో ఎక్స్80 (Vivo X80), వివో ఎక్స్80 ప్రో (Vivo X80 Pro), వివో ఎక్స్80 ప్రో ప్లస్ (Vivo X80 Pro+) స్మార్ట్ ఫోన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. గతంలో లాంచ్ అయిన వివో ఎక్స్70 సిరీస్ ఫోన్లకు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయి. వీటిలో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ ఉండనున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటివరకు వినిపిస్తున్న వార్తల ప్రకారం... ఈ ఫోన్లు మనదేశంలో ఏప్రిల్‌లో లాంచ్ కానున్నాయి. అయితే అంతకంటే ముందు చైనాలో ఈ ఫోన్లు లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. వివో ఎక్స్80 ప్రో ప్లస్‌లో క్వాల్‌కాం 8 జెన్ 1 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. ఇందులో జీస్ ట్యూన్డ్ కెమెరా సెటప్ ఉండనుంది. వివో గింబల్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉండనుంది.


PD2186X మోడల్ నంబర్‌తో కనిపించిన వివో స్మార్ట్ ఫోన్ అంటుటు బెంచ్ మార్కింగ్ వెబ్‌సైట్‌లో 1,072,221 పాయింట్లను స్కోర్ చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ ఉన్న స్మార్ట్ ఫోన్ ఈ స్కోరును సాధించిందని అంటుటు తెలిపింది. అయితే ఈ మూడిట్లో ఆ స్మార్ట్ ఫోన్ ఏదో మాత్రం తెలియరాలేదు. అంటుటు ఇప్పటివరకు అందించిన హయ్యస్ట్ స్కోర్ ఇదే.


వివో ఎక్స్80 సిరీస్ ధర (అంచనా)
ఇప్పటివరకు వచ్చిన లీకుల ప్రకారం... వివో ఎక్స్80 ధర 3,699 యువాన్లుగా (సుమారు రూ.43,300) ఉండే అవకాశం ఉంది. ఇక వివో ఎక్స్80 ప్రో ధర 4,599 యువాన్లుగా (సుమారు రూ.53,800), వివో ఎక్స్80 ప్రో ప్లస్ ధర 5,499 యువాన్లుగా (సుమారు రూ.64,400) ఉండనుందని సమాచారం.


వివో ఎక్స్80 స్పెసిఫికేషన్లు (అంచనా)
ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్టీపీవో అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌ను ఇందులో అందించే అవకాశం ఉంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉండనుంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జీఎన్5 సెన్సార్, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్663 సెన్సార్ ఇందులో ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 44 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండనుంది.


వివో ఎక్స్80 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా)
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఈ5 అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. ఇందులో కూడా 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ ఉండనుంది. ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో మూడు 50 మెగాపిక్సెల్ సెన్సార్లు, 12 మెగాపిక్సెల్ టెర్టియరీ సెన్సార్ ఉండనుందని తెలుస్తోంది. ఇందులో కూడా 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరానే అందించనున్నారని సమాచారం.


వివో ఎక్స్80 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా)
ఇందులో 6.78 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ+ ఎల్టీపీవో ఈ5 అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ ఉండనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5, 1 టీబీ వరకు స్టోరేజ్ ఉండనుంది. ఇందులో వెనకవైపు మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 48 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుందని సమాచారం.


Also Read: Google Play Pass: రూ.99 యాడ్స్ లేకుండా యాప్స్ - గూగుల్ ‘ప్లే పాస్’ వచ్చేసింది - యాప్ డెవలపర్లకు పండగే!


Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!