Vivo V30e India Launch: వివో వీ30ఈ మనదేశంలో త్వరలో లాంచ్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో కచ్చితంగా ఎప్పుడు లాంచ్ అవుతుందన్నది తెలియరాలేదు. ఏప్రిల్ 18వ తేదీన ఎక్స్/ట్విట్టర్‌లో దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. రెండు కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇందులో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, కర్వ్‌డ్ డిస్‌ప్లే అందించనున్నట్లు తెలుస్తోంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. వివో వీ29ఈకు తర్వాతి వెర్షన్‌గా వివో వీ30ఈ వచ్చింది.


Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు


దీనికి సంబంధించిన ల్యాండింగ్ పేజీ ఇప్పటికే వివో ఇండియా అధికారిక వెబ్ సైట్లో లైవ్ అయింది. దీన్ని బట్టి ఫోన్ కూడా త్వరలో మనదేశంలో లాంచ్ కానుందని అనుకోవచ్చు. రెడ్, సిల్క్ బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. కర్వ్‌డ్ డిస్‌ప్లే కాబట్టి బెజెల్స్ చాలా సన్నగా ఉన్నాయి. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాల సెటప్ చూడవచ్చు. అలాగే ఆరా ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. ఈ ఫోన్‌లో వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. ముందువైపు కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా ఫోన్ల కంటే బెస్ట్ సెల్ఫీ కెమెరా ఇదే అని చెప్పవచ్చు.






వివో వీ30ఈ స్మార్ట్ ఫోన్‌లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఏకంగా నాలుగు సంవత్సరాల పాటు ఈ బ్యాటరీ హెల్తీగా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఇండస్ట్రీ స్టాండర్డ్‌తో పోలిస్తే ఇది ఏకంగా డబుల్ అని తెలుస్తోంది.


వివో వీ30 5జీ స్మార్ట్ ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌పై రన్ కానుంది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ 14 ఆపరేటింగ్ సిస్టం ద్వారా ఫోన్ పని చేయనుంది. వివో వీ30, వివో వీ30 ప్రోలతో పాటే ఈ సిరీస్‌లో ఇది కనిపించనుంది. 


Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది


వివో వీ29ఈకి తర్వాతి వెర్షన్‌గా వివో వీ30ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లాంచ్ కానుంది. వివో వీ29ఈ స్మార్ట్ ఫోన్ రూ.25,999 ప్రారంభ ధరతో మనదేశంలో లాంచ్ అయింది. వివో వీ30ఈ ధర ఎంత ఉండనుందనే విషయం ఇంకా తెలియరాలేదు. రూ.30 వేలలోపే దీని ధర ఉండనుందని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.