Kamada Ekadashi 2024 Significance : నెలకు 2 ఏకాదశిలు వస్తాయి. ఏడాదికి మొత్తం 24 ఏకాదశిలు...ప్రతి ఏకాదశికి  ఓ ప్రత్యేకత ఉంటుంది. అందులో చైత్ర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని కామద ఏకాదశి , దమన ఏకాదశి అని అంటారు. సూర్యోదయానికి ముందే తలకు స్నానం ఆచరించి.. లక్ష్మీనారాయణులను ఆరాధించాలి. ఏకాదశికి ఉపవాసం, జాగరణ అనే నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. నేతితో దీపం వెలిగించాలి. పండ్లు, పువ్వులు, పాలు నైవేద్యంగా సమర్పించాలి. తులసి ఆకులు పూజకు తప్పనిసరిగా ఉపయోగించాలి. ఏకాదశి తర్వాత ద్వాదశి తిథి రోజు బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయాలి. అనంతరం ఉపవాస వ్రతాన్ని విరమించాలి.  ఈ ఏకాదకి వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయని , సంతానం లేనివారి కల ఫలిస్తుందని పురాణాల్లో ఉంది. వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలగిపోతాయని అంటారు. ఇందుకు నిదర్శనంగా పురాణాల్లో కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి...


Also Read: ఏప్రిల్ 23 చైత్ర పూర్ణిమ రోజు హనుమాన్ జయంతి కాదు హనుమాన్ విజయోత్సవం - ఈ రెండింటికి వ్యత్యాసం తెలుసా!



  • కామద ఏకాదశి ప్రస్తావన వరాహ పురాణంలో ఉంది...

  • శ్రీ కృష్ణుడు యుధిష్టరునికి కామద ఏకాదశి మహత్యం, విశిష్టత గురించి చెప్పాడు

  • దిలీప్ రాజుకి ఈ వ్రతం గురించి వశిష్ట మహర్షి వివరించాడు...


పూర్వం రత్నాపూర్ అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజ్యంలో ఉండే గంధర్వులు, అప్సరసలు సభలో నాట్యం చేసేవారు. వారిలో ఓ గంధర్వుడు...ఆ రోజు సభలో తన భార్యలేదనే ఆలోచనలో పడి తన బాధ్యత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.   అది గమనించిన మహారాజు ఆ గంధర్వుడిపై ఆగ్రహం చెంది.. నీ అందం, నీకు ఉన్న సృజనాత్మకత, నీ కళ నాశనమైపోవాలి అని శపిస్తాడు. అప్పుడు ఆ గంధర్వుడు అందరూ చూస్తుండగానే భయపడే ఆకారంలో మారిపోయాడు. అది తెలుసుకున్న గంధర్వుడి భార్య..భర్తను తీసుకుని అడవుల్లోకి వెళ్లిపోయింది. వింధ్యాచల అడవుల్లో ప్రయాణిస్తూ ఓ ఆశ్రమానికి వెళుతుంది. అక్కడ మహర్షితో జదరిగిన విషయం మొత్తం చెప్పి... తన బాధలు పోగెట్టే ఉపాయం చెప్పమని ప్రాధేయపడింది. అప్పుడు ఆ మహర్షి కామద ఏకాదశి వ్రతం, దాని మహత్యం గురించి వివరించాడు. ఆ కధ మహాత్యం విన్న గంధర్వుడి భార్య సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరించింది. దాన ధర్మాలు చేసింది..ఆ తర్వాత గంధర్వుడు సాధారణ రూపానికి వచ్చాడు. అంటే తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ కామద ఏకాదశి వ్రతం చేయడం ద్వారా తొలగిపోతాయంటారు...


Also Read: మూఢం వచ్చేస్తోంది మూహుర్తాలు పెట్టేసుకోండి త్వరగా - అసలు మూఢంలో శుభకార్యాలు ఎందుకు నిర్వహించకూడదో తెలుసా!


ఏకాదశి ఉపవాసం దేవుడి కోసం చేయకండి...


దేహమే దేవాలయం అంటోంది శాస్త్రం. ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం లాంటి సాధన ద్వారా ఆరాధించడమని అర్థం. పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు , మనస్సు అనే 11 ఇంద్రియాల ద్వారానే పాపాలు చేస్తారు...ఆ 11 అజ్ఞానానికి స్థానం..అందుకే ఆ 11 స్థానాల్ో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన రాక్షసుడిని జయించి జ్ఞానాన్ని,ముక్తిని పొందాలంటే ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని చెబుతారు.


Also Read: సమ్మర్ హాలీడేస్ లో మీ పిల్లలకు ఇవి తప్పనిసరిగా నేర్పించండి!


కుండలిని జాగృతం చేసేందుకే..


ప్రతి 15 రోజులకోసారి ఏకాదశి రోజు ఉపవాసం చేయడం ద్వారా మనలో ఉన్న కుండలి శక్తిని జాగృతం చేసి, మూలాధార చక్రం నుంచి స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలను దాటుకుంటూ సహస్రార చక్రంలో సహస్రకమలంలో కొలువైన పరమాత్మను దర్శించి బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మను సచ్చిదానంద రూపమైన పరమాత్మలో ఐక్యం చేయడమే...


కామద ఏకాదశి మాత్రమే కాదు...ఏ ఏకాదశి రోజైనా కానీ 'ఓ నమో నారాయణాయ' అనే అష్టాక్షరి మంత్రం, 'విష్ణు సహస్రనామం' పఠించినా విన్నా అంతా మంచే జరుగుతుంది...