భారత మార్కెట్లోకి వివో సరికొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. Vivo T2 5G స్మార్ట్ ఫోన్ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. బడ్జెట్ ధరలో 64 మెగా ఫిక్సెల్ కెమెరాతో విడుదలయ్యింది. ఈ ఫోన్ ప్రీమియం లుక్ తో పాటు చక్కటి ఫీచర్లను కలిగి ఉంది. Vivo T1 5G స్మార్ట్ ఫోన్ తర్వాత జెనెరేషన్ స్మార్ట్ ఫోన్ గా ఈ మొబైల్ విడుదల అయ్యింది. తాజాగా దేశీయ మార్కెట్లోకి అడుగు పెట్టిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లోని  ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర గురించి ఇప్పుడు చూద్దాం..   


Vivo T2 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు


Vivo T2 5G స్మార్ట్ ఫోన్ 6.38 అంగుళాల FHD+ AMOLED డిస్ ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ అందిస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్, 360 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. అంతేకాదు, ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీ కెమెరా కోసం చిన్న వాటర్ డ్రాప్ నోచ్ కటౌట్ ను కలిగి ఉంది. స్నాప్‌ డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తిని పొందుతుంది. 8 GB ర్యామ్, 128 GB ఇన్ బిల్ట్ స్టోరేజీని కలిగి ఉంటుంది.  


Vivo T2 5G కెమెరా సెటప్


 ఇక ఈ స్మార్ట్ ఫోన్ అదిరిపోయే కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టుతో 64 మెగా ఫిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంది. దీనికి తోడుగా 2 మెగా ఫిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగా ఫిక్సెల్ కెమెరాను కలిగి వుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ కలిగిన 4,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్  ఆధారంగా పని చేస్తోంది.  


Vivo T2 5G ధర ఎంత? ఎక్కడ లభిస్తుందంటే?


Vivo T2 5G బేసిక్ వేరియంట్ ప్రారంభ ధర రూ.17,499గా కంపెనీ నిర్ణయించింది. ఇది 6 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.  ఈ ఫోన్ లాంచ్ అఫర్ లో భాగంగా  పలు రకాల బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంక్ డెబిట్,  క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వినియోగదారులకు 10% వరకు తగ్గింపు అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లైన్ లైన్ స్టోర్ అయిన ఫ్లిప్ కార్ట్ తో పాటు Vivo అధికారిక వెబ్ సైట్ ద్వారాను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.  18 ఏప్రిల్ నుంచి సేల్ ప్రారంభం కానుంది.






గతేడాది ఫిబ్రవరిలో భారత్ లో ప్రారంభించిన Vivo T1 5Gకి తర్వాత Vivo T2 5G నెక్ట్స్ జెనెరేషన్ స్మార్ట్ ఫోన్ గా వస్తుంది. Vivo T1 5G ఫోన్‌లో స్నాప్‌ డ్రాగన్ 695 5G SoC అమర్చబడింది. 8 GB వరకు ర్యామ్, 128GB ఇన్ బిల్ట్ స్టోరేజీని కలిగి ఉంటుంది. Vivo T1 5G 6.58-అంగుళాల పూర్తి-HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌ను అందిస్తుంది. ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది.


Read Also: ట్విట్టర్ త్వరలో మాయం కాబోతోందా? ఎలన్ మస్క్ ట్వీట్ కు అర్థం ఇదేనా?