Vijayawada Temple Ticket Booking Service | విజయవాడ: వాట్సాప్ ద్వారా ఇంద్రకీలాద్రి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం పౌర సేవలు సులభముగా పొందడానికి '95523 00009 అనే వాట్సాప్ నెంబర్ ను ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా దేవాదాయ శాఖ ఏపీలో రెండో ప్రధాన దేవాలయం అయిన విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దర్శనాలు, సేవలు  బుక్ చేసుకోడానికి, విరాళము  అందించడాన్ని సులభతరం చేసింది. ప్రతి ఒక్కరూ సులభంగా అర్ధం చేసుకునేలా 9552300009 వాట్సాప్ నెంబర్ కు 'Hi' అని వాట్సప్ లో మెసేజి చేయడం ద్వారా సేవలు అందుకోవచ్చునని ఆలయ ఈవో కె.రామచంద్ర మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు.


ప్రస్తుతం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దర్శనములు కానీ, పూజలు కానీ, విరాళములు website-www.kanakadurgamma.org https://www.aptemples.ap.gov.in/ ఆలయ ఆర్టిత సేవ కౌంటర్ తో పాటు  అత్యంత సులువుగా వాట్సాప్ నెంబర్ కు పంపగావచ్చు. options ను సెలెక్ట్ చేసుకొని, వివరాలు నింపి, పేమెంట్(Online) కూడా చేసి టికెట్ ను భక్తుల వాట్సప్ నెంబర్ లో నేరుగా పొందవచ్చు.


వాట్సాప్ లో టికెట్ పొందే విధానం
1. 9552300009  అనే వాట్సాప్ నెంబర్ కు మీరు Hi అని మెస్సేజ్ చేయాలి. 



WhatsApp Governance: వాట్సాప్ ద్వారా ఇంద్రకీలాద్రి సేవలు ప్రారంభం, విజయవాడ దుర్గమ్మ సేవలు ఇలా బుక్ చేసుకోండి


2. 'Choose Service' సేవలు ఎంచుకోండి
options * Temple Booking Services', Vijayawada, Sri Durga Malleswara swamivarla Devasthanam Darshanam ను ఎంచుకుని, దేవస్థానంలోని Temple Darshanam లేదా Temple seva లేదా Temple donation option ను ఎంచుకోవాలి.  (అమ్మవారి అష్టోత్తర నామార్చన' book చేయుట కొరకు, ఇక్కడ Temple Seva ఆప్షన్ ఎంపిక చేశారు.




3. సేవల పట్టికలో కావలసిన సేవ (ఉదాహరణకు- 'శ్రీ అమ్మవారి అష్టోత్తర నామార్చన')ను ఎంపిక చేసుకొని, Date తో పాటు Time slot ను ఎంచుకొని, continue బటన్ ను నొక్కాలి. ఎంత మంది హాజరు అవుతున్నారో ఎంపిక చేసుకొని, వారి పేరు, ఆధార్ లేదా ఇతర id వివరాలు, గోత్రం, పుట్టినతేదీ వివరాలు పొందుపరచి, continue నొక్కాలి. తరువాత వచ్చే స్క్రీన్ నందు వ్యక్తుల, పూజా, రుసుము వివరములు సరిచూసుకొని 'confirm' నొక్కితే పేమెంట్ options ను ఎంపిక చేసుకోవాలి.




4. పేమెంట్ పద్దతిని ఎంచుకుని, తరువాత వచ్చే ఆప్షన్‌ను ఎంచుకుని పేమెంట్ చేయాలి. (ఇక ఫోన్ పే ద్వారా పేమెంట్ చేయడం పూర్తి)




5. పేమెంట్ పూర్తయిన తరువాత బుక్ చేయాల్సిన టికెట్ భక్తులకు వాట్సాప్ లో వస్తుంది. భక్తులు ఈ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది.


Also Read: WhatsApp Governance: వాట్సాప్ ద్వారా తిరుమల టిక్కెట్‌లు కూడా బుక్ చేసుకోవచ్చా ? - మన మిత్ర పని తీరు ఎలా ఉంది ?