ప్రపంచ నంబర్ వన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పేమెంట్స్ ఆప్షన్‌ను ఎప్పుడో అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల యూజర్ బేస్ ఉన్నా పేమెంట్ ఫీచర్ మాత్రం వాట్సాప్‌కు పెద్దగా వర్కవుట్ కాలేదు.
దీన్ని మార్చడానికి ఇప్పుడు వాట్సాప్ కొత్త ప్లాన్‌తో ముందుకు వస్తుంది. వాట్సాప్ పే ద్వారా మొదటి పేమెంట్ చేస్తే రూ.35 క్యాష్ బ్యాక్ లభించనుంది. మూడు వేర్వేరు కాంటాక్ట్స్‌కి మూడు సార్లు నగదు పంపిస్తే ఈ క్యాష్ బ్యాక్ లభించనుంది. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రస్తుతానికి లిమిటెడ్ పీరియడ్ టైం వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.
వాట్సాప్ పేమెంట్ చేయడం ఎలా?
1. మీ కాంటాక్ట్స్‌కి మనీ పంపడానికి మొదట వాట్సాప్ ఓపెన్ చేయండి. అక్కడ Options > Payments > Send New Paymentను ఎంచుకోవాలి.
2. అనంతరం మీరు ఏ కాంటాక్ట్‌కి నగదు పంపాలనుకుంటున్నారో వారి కాంటాక్ట్‌ను ఎంచుకోండి.
3. అక్కడ మీకు ఒక గిఫ్ట్ ఐకాన్ కనిపిస్తుంది. ఒకవేళ మీకు గిఫ్ట్ ఐకాన్ కనిపించకపోతే వారిని మీరు వాట్సాప్ పేకు ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది.
4. ఒకవేళ వారికి అప్పటికే వాట్సాప్ పే ఉంటే send > tap Next > Tap Send Paymentపై క్లిక్ చేయాలి. అనంతరం మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి.
అయితే కొంతమందికి వాట్సాప్ పే ద్వారా నగదు పంపడం సేఫా కాదా అనే అనుమానం ఉండవచ్చు. అయితే పేమెంట్ మోడ్ యూపీఐ కాబట్టి సేఫ్టీ విషయంలో పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. యూపీఐ పేమెంట్స్ గురించి అవగాహన ఉంటే సరిపోతుంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!