Whatsapp Best Features: ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీని ప్రపంచంలోని అనేక దేశాల్లో వాలెంటైన్స్ డేగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు ఈ రోజును రకరకాలుగా జరుపుకుంటారు. కొంతమంది జంటలు రెస్టారెంట్‌లో డిన్నర్‌కు వెళతారు. మరికొందరు క్లబ్‌లో డ్యాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ప్రపంచంలో చాలా మంది ప్రేమికులు ఒకరికొకరు దూరంగా నివసిస్తున్నారు. ఈ సందర్భంగా కూడా కలిసి ఉండలేరు. ప్రేమికుల రోజున ఇలా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్న జంటలకు వాట్సాప్ అతిపెద్ద మద్దతుగా మారుతుంది.


వాస్తవానికి వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా దూరంగా నివసిస్తున్న జంటలు కూడా సన్నిహితంగా ఉండగలుగుతారు. ఈ మెసేజింగ్ యాప్‌లలో టెక్స్ట్ మెసేజ్‌లు, వీడియో కాల్‌లు, వాయిస్ మెసేజ్‌లు, వాలెంటైన్ స్టిక్కర్లు, వాలెంటైన్ జిఫ్‌లు వంటి అనేక అంశాలు ఉన్నాయి.


ఏ సంబంధంలోనైనా కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైనది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌లో ఈ కమ్యూనికేషన్‌కు ఇంపార్టెన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు అనేక ఫీచర్లను అందిస్తుంది. దీని ద్వారా దూరంగా నివసించే జంటలు ప్రేమికుల రోజున తమకు నచ్చిన వారు పక్కన లేరనే బాధను తగ్గించుకోవచ్చు.


వాట్సాప్‌లో చాలా ఆప్షన్స్
వాట్సాప్ ద్వారా మీరు మీ భాగస్వామికి దూరంగా ఉంటే వారి పట్ల మీకు ఎలా అనిపిస్తుందో తెలియజేయవచ్చు. మీ టైమ్‌జోన్‌లు వేర్వేరుగా ఉంటే సాధారణ కాల్స్ మాట్లాడటం చాలా కష్టం అవుతంది. కానీ వాట్సాప్ ద్వారా ఉచితంగా టెక్స్ట్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌ల ద్వారా మీ భావాలను పంచుకోవచ్చు.


మీరు జోకులు వ్రాసి స్టిక్కర్లను తయారు చేయవచ్చు. వాటిని మీ భాగస్వామికి పంపవచ్చు. అలా వారిని నవ్వించవచ్చు. వాట్సాప్ దాని ఐవోఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులను స్టిక్కర్లను క్రియేట్ చేయడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. అంతేకాకుండా ఉచితంగా వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ చేయవచ్చు. ప్రేమికుల దినోత్సవాన్ని కలిసి జరుపుకోవచ్చు.


ఇది కాకుండా మీరు వీడియో కాల్ ద్వారా మీ భాగస్వామితో కేక్ కట్ చేయించవచ్చు. మీకు ఇష్టమైన క్షణాల స్క్రీన్‌షాట్‌లను తీసుకొని వాటిని స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు దూరంగా ఉన్నప్పటికీ మీ ప్రేమను పంచుకోవచ్చు. వాలెంటైన్స్ డేని మెరుగ్గా చేసుకోవచ్చు.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?