టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గుర్తుతెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చినా, ఎవరు చేశారో తెలుసుకునే వెసులుబాటు కల్పించబోతుంది. కాల్ స్వీకరించినప్పుడు కాలర్ పేరు డిస్‌ప్లే మీద కనిపించేలా సరికొత్త మార్పులు తీసుకురానుంది. గుర్తుతెలియని కాల్స్ మూలంగా చాలామంది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని ట్రాయ్ దృష్టికి వచ్చింది. అంతేకాదు, గుర్తు తెలియని వ్యక్తులు ఫేక్ నెంబర్స్ ద్వారా పలువురిని బెదిరించినట్లు గుర్తించారు. ఇకపై ఎవరు, ఎవరికి కాల్ చేసినా, వారికి పేరు కనిపించేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. టెలికాం ఆపరేటర్ల దగ్గర అందుబాటులో ఉన్న వినియోగదారుల కస్టమర్ (KYC) రికార్డ్‌ను బట్టి కాల్ చేసిన వారి పేరు డిస్ ప్లే అవుతుందని వెల్లడించింది. ట్రాయ్ తీసుకునే ఈ నిర్ణయం మూలంగా తమ కాంటాక్ట్ లిస్టులో కాలర్ నెంబర్ లేకపోయినా, ఫోన్ చేసిన వారు ఎవరనేది ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
⦿ కచ్చితమైన గుర్తింపు పొందే అవకాశం!
ప్రస్తుతం వినియోగదారులు తెలియని కాలర్ గుర్తింపును కనుగొనేందుకు ట్రూ కాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్ లను ఉపయోగించుకుంటున్నారు. డేటా క్రౌడ్ సోర్స్ గా ఉన్నందున Truecaller లాంటి యాప్ లకు చాలా వరకు పరిమితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కచ్చితమైన ప్రామాణికత ఉండదు. కానీ, ట్రాయ్ తీసుకునే కేవైసీ డేటా ఆధారంగా డిస్ ప్లే అయ్యే పేరు వందకు వంద శాతం కచ్చితంగా ఉంటుంది.
⦿ ఎందుకంటే.. ఈ KYC డేటా, సర్వీస్ ప్రొవైడర్లు అధికారికంగా ఇస్తారు. ఇందులో ఎలాంటి తప్పుడు సమాచారానికి అవకాశం ఉండదు. దీని కారణంగా కాలర్ కు సంబందించి కచ్చితమైన గుర్తింపు ఉంటుంది. ఈ చర్యల మూలంగా స్పామ్ (Spam) కాల్స్ ను నివారించే అవకాశం ఉంటుంది. థ్రెటెనింగ్ కాల్స్ నుంచి రక్షణ పొందే వెసులుబాటు ఉంటుంది. త్వరలో ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
Also Read: వీఎల్‌సీ మీడియా ప్లేయర్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - బ్యాన్ ఎత్తేసిన ప్రభుత్వం!
⦿ వాట్సాప్ విషయంలోనూ కీలక నిర్ణయం
వాట్సాప్ విషయంలోనూ ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సమీప భవిష్యత్తులో వాట్సాప్ ద్వారా చేసే కాల్‌ల కోసం ప్రత్యేక ఎక్సైజ్ కూడా చేస్తోంది. Whats App SIM కార్డ్‌లకు లింక్ చేయబడి ఉంటున్నందున, వినియోగదారు ఫోన్ నంబర్, Whats App అకౌంట్ కు మధ్య లింక్ ఉంటుంది. "DoT, Trai, టెలికాం ఆపరేటర్ల మధ్య అనుసంధానం కోసం ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి త్వరలో వాట్సాప్ విషయంలో కేంద్రం కచ్చితమైన నిర్ణయం తీసుకోబోతోందని తెలుస్తోంది.
Read Also: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసా? ఇలా చేస్తే ఈజీగా తెలిసిపోతుంది