మీ ఆధార్ మీద ఎన్ని సిమ్ కార్డులున్నాయో తెలుసుకోండిలా!


ఆధార్ కార్డు దేశ ప్రజలందరికీ ప్రస్తుతం ముఖ్యమైన గుర్తింపు కార్డుల్లో ఒకటిగా మిగిలిపోయింది. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసే సమయంలోనూ, ప్రభుత్వ పథకాలు పొందే సమయంలోనూ, మోబైల్ సిమ్ కనెక్షన్ తీసుకునేటప్పుడు తప్పకుండా ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో చాలా సిమ్ కార్డులు మిస్ యూజ్ చేయబడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. సిమ్ కార్డులు దుర్వినియోగం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఎవరైనా సిమ్ కార్డ్‌ని పొందడానికి మీ ఆధార్ కార్డ్‌ని ఉపయోగించారో? లేదో? తెలుసుకోవడానికి, ప్రభుత్వం ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. దీని సహాయంతో మీ పేరు మీద ఎన్ని సిమ్‌లు రిజిస్టర్ అయ్యాయో? ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయో? చెక్ చేసుకునే అవకాశం ఉంది.   


ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించిన టెలికమ్యూనికేషన్ శాఖ


కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని  టెలికమ్యూనికేషన్ శాఖ TAFCOP (టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్) పేరుతో ఒక పోర్టల్‌ను ఓపెన్ చేసింది. ఇందులో మీ ఆధార్ కార్డు నెంబర్ మీద ఎన్ని మొబైల్‌ సిమ్ లు రిజిస్టర్ అయ్యాయో సులభంగా తెలుసుకోవచ్చు. 2018లో టెలికాం శాఖ  ఒక వ్యక్తికి 18 మొబైల్ కనెక్షన్ల వరకు తీసుకునే వెసులుబాటు కల్పించింది.  ఇందులో సాధారణ మొబైల్ వినియోగం కోసం 9 సిమ్‌లు, మిగిలిన 9 M2M (మెషిన్ టు మెషిన్) కమ్యూనికేషన్‌ల కోసం ఉపయోగించవచ్చని వెల్లడించింది.   ఇక మీ ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్ లు యాక్టివేట్ అయ్యాయో తెలుసుకునే అవకాశం ఉంది.


మీరు జస్ట్ ఈ కింద ఉన్న స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది!


స్టెప్ 1: ముందుగా వినియోగదారులు tafcop.dgtelecom.gov.inకి వెళ్లండి


స్టెప్ 2: ఇందులో మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.


స్టెప్ 3: ఆ తర్వాత మీ ఫోన్ కు ఓటీపీ వస్తుంది.   


స్టెప్ 4: అంతేకాకుండా మీరు OTP ప్యానెల్‌కు వెళ్తారు.


స్టెప్ 5: ఆ తర్వాత OTPని ఎంటర్ చేసి,  వాలిడేషన్ పై క్లిక్ చేయాలి.


స్టెప్ 6: ఇప్పుడు మీ ఆధార్‌ కార్డు మీద ఎన్ని సిమ్ లు జారీ అయ్యాయో లిస్టు మీకు కనిపిస్తుంది. 


మీకు తెలియని నెంబర్ ఉంటే ఫిర్యాదు చేయండి!


ఒక వేళ మీకు తెలియని నెంబర్లు ఈ లిస్టులో గుర్తించినట్లైతే టెలికాం శాఖకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. మీరు జాబితాలో తెలియని నంబర్‌ ను  గుర్తిస్తే, ఎడమ చెక్ బాక్స్‌పై క్లిక్ చేసి.. ఆ నంబర్‌ పై ఫిర్యాదు చేయాలి. అయితే, సదరు నంబర్‌ను బ్లాక్ నిలిపి వేయడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌తో కూడా కనెక్ట్ కావాల్సి ఉంటుంది.


Read Also: 5G రోల్ అవుట్ అంటే 4G ముగిసిపోతుందా ? భారత్ లో ఏ ఫోన్లు 5Gకి చేస్తాయంటే?