రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా సెల్ ఫోన్లతో పాటు టీవీల్లోనూ టేటెస్ట్ ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. నెట్ కనెక్షన్ ఉంటే చాలు డిష్ కనెక్షన్ లేకపోయినా, సినిమాలు, సీరియల్స్, ఆటలు, పాటలు అన్నీ చూసే అవకాశం ఉంది. అంతేకాదు, Android స్క్రీన్‌ ను టీవీకి కనెక్ట్ చేసే వెసులుబాటు సైతం అందుబాటులోకి వచ్చింది.  


టీవీకి కనెక్ట్ చేయడం వల్ల లాభం ఏంటి?


వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ ఫోన్‌ను టీవీకి కనెక్ట్ చేయడం ద్వారా పెద్ద టీవీ స్క్రీన్‌పై పలు రకాల యాప్స్ ఉపయోగించవచ్చు.  వీడియోలను చూడవచ్చు. వెబ్‌ సైట్‌ లను ఓపెన్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ లో చేసే యాక్టివిటీస్ అన్ని టీవీ స్క్రీన్ మీద చూసే అవకాశం ఉంది.  మీ టీవీలో Chrome ట్యాబ్ లేదంటే మీ స్క్రీన్‌ని చూడటానికి Chromecast పరికరాన్ని ఉపయోగించుకోవచ్చు. 


ఆండ్రాయిడ్ ఫోన్ ను టీవీకి ఎలా కనెక్ట్ చేయాలంటే?


మీ మొబైల్ ఫోన్ లేదంటే టాబ్లెట్ మీ Chromecast పరికరం మాదిరిగా  Wi-Fi నెట్‌ వర్క్‌ కి కనెక్ట్ చేయబడిందని మీరు ముందుగా నిర్దారించుకోవాలి. మీ Android స్క్రీన్‌ ను టీవీకి కనెక్ట్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్టెప్స్ వరుస క్రమంలో ఫాలో అయితే మీ ఆండ్రాయిడ్ ఫోన్ టీవీకి కనెక్ట్ అవుతుంది. మీ ఆండ్రాయిడ్ స్క్రీన్‌ని టీవీకి ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..


మీ ఆండ్రాయిడ్ ఫోన్ టీవీకి కనెక్ట్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలోకండి!


⦿ స్టెప్ 1 : ముందుగా మీ మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్‌ ను మీ Chromecast పరికరంతో పాటు అదే Wi-Fi నెట్‌ వర్క్‌ కి కనెక్ట్ చేయాలి.


⦿ స్టెప్ 2 : ఇప్పుడు Google Home యాప్‌ ని ఓపెన్ చేయాలి.


⦿ స్టెప్ 3 : మీరు మీ స్క్రీన్‌ ను కనెక్ట్ చేయాలనుకుంటున్న ఫోన్ కు సంబంధించిన టైల్‌ను టచ్ చేసి పట్టుకోవాలి.


⦿ స్టెప్ 4 : చివరగా, 'కాస్ట్ మై స్క్రీన్'పై ట్యాప్ చేయాలి.


⦿ స్టెప్ 5 : చివరగా Cast స్క్రీన్‌పై క్లిక్ చేయాలి.


⦿ ఇలా చేస్తే మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ టీవీకి వెంటనే కనెక్ట్ అవుతుంది.


⦿ ఇందుకు టీవీ మీ పర్మిషన్ అడుగుతుంది. రిమోట్ ద్వారా ఒకే చేస్తే మీ మొబైల్ స్క్రీన్.. టీవీ స్క్రీన్ మీద ప్రత్యక్షం అవుతుంది.


⦿ మీ ఫోన్ లో చేసే యాక్టివిటీ అంతా టీవీ స్క్రీన్ మీద కనిపిస్తుంది.


⦿ మీ అరచేతిలోని బుల్లి మాయా పేటికలోని చిత్రాలను, వీడియోలనే కాదు, సినిమాలు కూడా పెద్ద స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయ్యొచ్చు.


Read Also: 5G రోల్ అవుట్ అంటే 4G ముగిసిపోతుందా? భారత్ లో ఏ ఫోన్లు 5Gకి చేస్తాయంటే?