Union Budget App: భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 సంవత్సరం కోసం బడ్జెట్‌ను సమర్పించారు. ఇది మధ్యంతర బడ్జెట్. ఎందుకంటే ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి 2024జూలైలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇదే చివరి బడ్జెట్‌. ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్‌ను డిజిటల్‌ మీడియం ద్వారా ప్రవేశపెట్టారు.


గత మూడేళ్లుగా ప్రతిసారీ బడ్జెట్‌ను డిజిటల్‌గా సమర్పిస్తున్నారు. 2021 సంవత్సరం నుంచి పేపర్‌లెస్ అంటే డిజిటల్ బడ్జెట్‌ను ప్రభుత్వం సమర్పిస్తోంది. బడ్జెట్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎక్కడ అందిస్తారనే ప్రశ్న ప్రజల మనస్సుల్లో ఎప్పుడూ ఉంటుంది.


ఏ యాప్‌లో మీరు బడ్జెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పొందవచ్చు?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు సమర్పించిన 2024-24 మధ్యంతర బడ్జెట్ గురించి మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే, భారత ప్రభుత్వం లాంచ్ చేసిన యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌ని (Union Budget App) ఉపయోగించవచ్చు.


ఈ యాప్ ద్వారా ఏ యూజర్ అయినా బడ్జెట్ డాక్యుమెంట్ మొత్తాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, చదవచ్చు. సాధారణ భాషలో అర్థం చేసుకోవచ్చు. వినియోగదారులు ఈ యాప్‌లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌కు సంబంధించిన అన్ని పత్రాలను పొందుతారు. వీటిలో ఫైనాన్స్ బిల్లు, బిల్లుల డిమాండ్లు, వార్షిక ఆర్థిక నివేదిక వంటి అనేక ఇతర పత్రాలు కూడా ఉంటాయి.


యాప్ ఎప్పుడు లాంచ్ అయింది?
ఇది 2021లో బడ్జెట్‌ను సమర్పించడానికి ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించిన ప్రభుత్వ యాప్. ఈ యాప్‌ని ఎన్ఐసీ(NIC) అంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించింది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం అందుబాటులో ఉంది.


ఈ యాప్‌లో వినియోగదారులు హిందీ, ఇంగ్లిష్ భాషలలో బడ్జెట్‌కు సంబంధించిన అన్ని పత్రాలను చదవడం, తెలుసుకోవడం, డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్‌ను పొందుతారు. వినియోగదారులు ఈ పత్రాలను ప్రింట్ కూడా చేసుకోవచ్చు. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.


మరోవైపు 2024 మధ్యంతర బడ్జెట్‌లో వేతన జీవులకు నిరాశ తప్పలేదు. టాక్స్‌ రిబేట్‌ పెంచుతారేమోనని ఎదురుచూసిన వాళ్ల ఆశలపై నిర్మలమ్మ నీళ్లు చల్లారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిగుమతి సుంకాలు సహా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల పన్నుల రేట్లలో ఎలాంటి మార్పులు లేవని ప్రకటించారు. 2023 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లో ఉన్న ఆదాయ పన్ను రేట్లే ఇకపైనా కొనసాగుతాయి. బడ్జెట్‌ ప్రసంగంలో మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే వారి సంఖ్య 2014 నుంచి ఇప్పటి వరకు 2.4 రెట్లు పెరిగిందని, ప్రత్యక్ష పన్ను వసూళ్లు మూడు రెట్లు పెరిగాయని చెప్పారు.


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!