ట్విట్టర్‌లో కంటెంట్ క్రియేటర్లకు ఒక రిలీఫ్ న్యూస్. క్రియేటర్లకు చెల్లింపులు జరపడాన్ని ట్విట్టర్ ప్రారంభించింది. ఇందుకోసం యాడ్స్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రామ్‌ను కంపెనీ స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ట్విట్టర్ స్వయంగా ట్వీట్ చేసింది.


ట్విట్టర్‌లో నేరుగా డబ్బు సంపాదించడంలో వ్యక్తులకు సహాయపడే ప్రయత్నాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది. ఈ కార్యక్రమం ప్రస్తుతం ట్విట్టర్ క్రియేటర్ల ఇనీషియల్ గ్రూపు కోసం ప్రారంభించారు. ఈ నెలాఖరు నుంచి ప్రోగ్రాంను మరింత విస్తరిస్తారు.


ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం అర్హులైన క్రియేటర్‌లందరికీ (ట్విట్టర్ క్రియేటర్స్) యాప్‌లో, ఈ-మెయిల్ ద్వారా మొదటి చెల్లింపుగా ఎంత డబ్బు లభిస్తుందో ఇప్పటికే తెలియజేశారు. కొంతమంది ట్విట్టర్ క్రియేటర్స్ ఇప్పటికే దీన్ని షేర్ చేస్తున్నారు. ఇది కాకుండా వారి ఖాతాలలో నగదు ఎప్పటిలోపు జమ అవుతుందో కూడా తెలిపారు.


మానిటైజేషన్ ద్వారా నగదు పొందాలంటే ట్విట్టర్‌లో మొదటగా బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను పొంది ఉండాలి. గత మూడు నెలల్లో మీ పోస్టులపై ప్రతి నెలా కనీసం ఐదు మిలియన్ల ఇంప్రెషన్లు సాధించాలి. దీంతో పాటు క్రియేటర్ మానిటైజేషన్ స్టాండర్డ్స్ కోసం హ్యూమన్ రివ్యూలో పాస్ అయి ఉండాలి.


ట్విట్టర్‌కు సవాలుగా మారిన థ్రెడ్స్
ట్విట్టర్ నుంచి యాడ్స్ ద్వారా చెల్లింపు రాబట్టడం కంపెనీకి సవాలుగా మారింది. ఎందుకంటే మెటా ఇటీవల ట్విట్టర్‌కి పోటీదారుగా కొత్త థ్రెడ్స్ యాప్‌ని లాంచ్ చేసింది. చాలా మంది థ్రెడ్స్ యాప్‌ను ట్విట్టర్ కిల్లర్‌గా అభివర్ణించారు. ఈ వారం ప్రారంభంలో థ్రెడ్స్ తన మొదటి 100 మిలియన్ల వినియోగదారులను పొందింది.


ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్‌గా మారింది. అయితే ట్విట్టర్ మెటా రూపొందించిన ఈ యాప్‌ను కాపీ అని పేర్కొంది. మెటాపై దావా వేస్తానని కూడా ట్విట్టర్ ఇప్పటికే నోటీసు ద్వారా హెచ్చరించింది.


















Read Also: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం, ఇంతకీ ఏం జరిగింది?


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial