మనిషి జీవితంలో ఇప్పుడు స్మార్ట్ అనే పదం కామన్‌గా మారిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లోస్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. అలాగే ప్రతి ఇంట్లోనూ స్మార్ట్ టీవీ ఉంటోంది. ఈ స్మార్ట్ టీవీతో హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటివి ఓెపెన్ చేసుకునే అవకాశం ఉండటంతో ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేస్తు్న్నారు.  ఈ స్మార్ట్ టీవీలు బ్రౌజర్తో పాటుగా వస్తాయి, మీరు ఇందులో కూడా ఇంటర్నెట్ని బ్రౌజ్ చేయవచ్చు. మీ ఇంటి Wi-Fi కి అనుసంధానించే అంతర్నిర్మిత Wi-Fi కలిగి ఉండటం వలన ఈ విధంగా జరుగుతుంది మరియు బ్రౌజర్లు, లేదా స్మార్ట్ టీవీ యాప్స్ ద్వారా ఇంటర్నెట్ను యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. 


ఒకప్పుడు స్మార్ట్ టీవీలు అంటే చాలా ఖరీదుగా ఉండేవి.ఇప్పుడు  పదివేలకు కూడా వస్తున్నాయి. అయితే ఊరూపేరూ లేని బ్రాండ్ టీవీలు రూ. పదివేలకు వస్తున్నాయి. కానీ తోషిబా లాంటి మల్టీనేషనల్ కంపెనీలుకూడా రూ. పదమూడు వేలకే స్మార్ట్ టీవీలు ఇస్తున్నారు. Toshiba 80 cm (32 inch) HD Ready Vidaa OS Smart LED TV మోడల్ టీవీ రూ. పదమూడు వేలకే అందుబాటోలు ఉంది. ఈ టీవీలో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. 


VIDAA టెక్నాలజీ ద్వారా ఆధారితమైన ఈ తోషిబా స్మార్ట్ ని రూపొందించారు. CEVO ఇంజిన్ ప్రీమియం, ఆటోమేటిక్ మోషన్ రిజల్యూషన్+ మరియు కాంట్రాస్ట్ బూస్టర్ టెక్నాలజీలకు టెలివిజన్ అద్భుతమైన చిత్ర నాణ్యతను అందిస్తుంది. డాల్బీ పవర్డ్ 20W పవర్‌ఫుల్ స్పీకర్‌లతో ఆడియో క్రిస్టల్ క్లియర్‌గా  ప్రభావవంతంగా ఉంటుంది. సొగసైన డిజైన్  స్టైలిష్ 2 పోల్ స్టాండ్ ఉంటాయి. ఈ స్మార్ట్ టీవీ VIDAA ద్వారా స్మార్ట్‌గా పన ిచేస్తుంది. ఇది టీవీల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఆపరేటింగ్ సిస్టమ్, టీవీలలో ఉత్తమ స్మార్ట్ ఫీచర్ అనుభవం కోసం పూర్తిగా ఆప్టిమైజ్ చేశారు.  యాప్‌లకు సులభంగా యాక్సెస్ చేయడానికి ఈ ఆపరేటింగ్ సిస్టం ఉపయోగపడుతుంది.  


VIDAA వేగవంతమైనది, మొబైల్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌లా కాకుండా లోడ్ చేయడానికి అదనపు ఫైల్‌లు ఉండవ.  ఇది సాధారణ TV కంటే 3 రెట్లు  వేగంగా మరియు ఛానెల్ శోధనలో 20% వేగంగా బూట్ అవుతుంది. రిమోట్‌లో డైరెక్ట్ యాక్సెస్ హాట్‌కీలతో, ఇష్టమైన యాప్‌లను తక్షణమే యాక్సెస్ చేయవచ్చు. Vనెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యప్ టీవీ, హంగామా  యాప్‌లు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో Toshiba 80 cm (32 inch) HD Ready Vidaa OS Smart LED TV మోడల్ ఇంకా ఆఫర్ల వల్ల తక్కువకే వస్తుంది. దుకాణాల్లో అయితే రూ. పదమూడు వేలకు వస్తుంది.