ఫ్రెంచ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ థామ్సన్ మనదేశంలో కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. ఆల్ఫా సిరీస్‌లో 32 ఇంచుల సైజులో ఈ టీవీ లాంచ్ అయింది. ఈ టీవీ ధర తక్కువగానే ఉంది. దీనికి అంచులు కూడా లేవు. యూట్యూబ్, ప్రైమ్ వీడియో, సోనీ లివ్, జీ5, ఎరోస్ నౌ వంటి యాప్స్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేసి అందించనున్నారు.


థామ్సన్ 32 అంగుళాల ఆల్ఫా సిరీస్ స్మార్ట్ టీవీ ధర
దీని ధరను మనదేశంలో రూ.9,999గా నిర్ణయించారు. జూన్ 26వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీ సేల్ జరగనుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించనున్నారు. అంటే రూ.9 వేలకే ఈ టీవీని దక్కించుకోవచ్చన్న మాట. ఈ టీవీతో పాటు ఉచితంగా గానా ప్లస్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభించనుంది.


థామ్సన్ 32 అంగుళాల ఆల్ఫా సిరీస్ స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ టీవీలో హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ రిజల్యూషన్ 1366 x 768 పిక్సెల్స్‌గా ఉంది. అంచులు లేని స్క్రీన్‌ను ఈ టీవీలో అందించారు. ఈ టీవీ 30W సౌండ్ అవుట్‌పుట్‌ను అందించనుంది. క్విక్ కాస్ట్ ఫీచర్ ద్వారా స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్ టాప్ స్క్రీన్ కూడా టీవీపై ప్రజెంట్ చేయవచ్చు.


మాలి క్వాడ్ కోర్ జీపీయూ ప్రాసెసర్, యామ్‌లాజిక్ చిప్‌సెట్‌లను ఇందులో అందించారు. గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మొత్తంగా ఐదు వేలకు పైగా యాప్స్‌ను ఈ టీవీలో ఎంజాయ్ చేయవచ్చు. రెండు యూఎస్‌బీ పోర్టులు, మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, 2.4 గిగాహెర్ట్ట్ వైఫై, హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ టీవీలో ఉన్నాయి. 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!