Karthika Deepam  జూన్ 22 బుధవారం ఎపిసోడ్ 


హిమకు క్యాన్సర్ లేదని సౌందర్యకు తెలిసిపోవడంతో ఇంట్లో భారీ డిస్కషన్ జరుగుతుంది. అప్పుడే అక్కడకు వచ్చిన  స్వప్న ఇంట్లో పెద్ద గొడవ పెట్టుకుంటుంది. పెళ్లి కాకముందే నన్ను ఇలా బెదిరిస్తూ మాట్లాడుతోంది పెళ్లైన తర్వాత ఇంకెలా మాట్లాడుతుందో అంటుంది. పోనీ ఏదైనా అందామంటే ఒంట్లో బాగాలేదన్న సానుభూతి ఒకటి అంటుంది. మీ సానుభూతి ఇక్కడ ఎవరకూ కోరుకోవడం లేదంటుంది హిమ.అక్కడందరూ షాక్ అవుతారు..స్వప్న కోపంగా వెళ్లిపోతుంది. ఆ వెనుకే నిరుపమ్ వెళ్లిపోతాడు.
సౌందర్య: ఇంతకీ నీ విషయం ఏంటో చెప్పు..అర్థంకావడం లేదు. ఎందుకిదంతా చేశావ్
హిమ: శౌర్య కోసమే ఇదంతా చేశాను
సౌందర్య-ఆనందరావు: ఇన్నాళ్లూ శౌర్యకోసమే కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాం ఇప్పుడు ఇలా మాట్లాడతావేంటే..
హిమ: శౌర్య గురించి మీకు పూర్తి వివరాలు చెప్పేముందు మనం ఓ దగ్గరకు వెళదాం
సౌందర్య: నా రౌడీపిల్లను చూసేందుకు నేను ఎక్కడికైనా వస్తాను
హిమ: ఆశ్రమానికి వెళతానంటూ నాకు కాల్ చేసింది..అక్కడే ఉంటుందేమో అనుకుంటుంది
సౌందర్య: ఇంకా ఆలోచిస్తున్నావేంటి పద వెళదాం..


Also Read: ఒక్క చెంపదెబ్బతో కథ మొత్తం మార్చేసిన సౌందర్య, శౌర్య కి మళ్లీ అన్యాయం జరిగినట్టేనా!


కట్ చేస్తే ఆశ్రమం బయట చెట్లకింద నిల్చుని ఉంటుంది శౌర్య..అక్కడకు నిరుపమ్ వస్తాడు
జ్వాల: నమస్తే డాక్టర్ సాబ్, నేను మీమీద అలిగాను, కాల్ చేయరు, కాల్ చేస్తే తీయరు, అసలు భోజనం చేయడం కూడా మరిచిపోతున్నారు తెలుసా
నిరుపమ్: గతంలో శౌర్య ప్రపోజ్ చేయబోయిన విషయం గుర్తుచేసుకుంటాడు
జ్వాల: నా మనసులో మాట చెప్పలేదని మీరు నాపై అలిగారా..ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇప్పటివరకూ కోరుకోనంతగా నేను మిమ్మల్ని....
నిరుపమ్: జ్వాలా ప్లీజ్ అసలు ఏంటి నీ ఉద్దేశం..నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి..
జ్వాల: ఏమంటున్నారు..నాపై కోపం ఏంటి
నిరుపమ్:వెనకాముందూ ఆలోచించకుండా నాపై ఆశలు పెంచుకోవడమే నువ్వు చేసిన పెద్ద తప్పు
జ్వాల: కొత్తగా మాట్లాడుతున్నారేంటి, మీ మమ్మీ మాటలకు లొంగిపోయి ఆ శోభను పెళ్లిచేసుకోవడానికి
నిరుపమ్: మీ మనసు మాట వినండి నువ్వే కదా చెప్పావ్..నా మనసులో నువ్వు లేవు..
జ్వాల: డాక్టర్ సాబ్ ఏం మాట్లాడుతున్నారు
నిరుపమ్: నిజం మాట్లాడుతున్నాను..నా మనసులో వేరేవాళ్లున్నారు..తనతోనే జీవితం..
ఇదంతా చెట్టుపక్కనుంచి నిల్చుని వింటున్న సౌందర్య ఏంటిదంతా అని అడగడంతో తనే శౌర్య నానమ్మ అని హిమ నిజం చెప్పేస్తుంది.
హిమ: శౌర్య నిరుపమ్ బావని ప్రేమిస్తోంది..తను మాత్రం తనను కాదంటున్నాడు..ఇప్పుడేం చేయాలి
నిరుపమ్: నిన్ను ఎప్పుడైనా ప్రేమిస్తున్నానని చెప్పానా..( అప్పుడు తాగి ఉన్నప్పుడు హిమపై కోపంతో ఐలవ్ యూ చెప్పిన విషయం గుర్తుచేసుకుంటుంది). జ్వాలా ఐ లవ్ యూ అని ఎప్పుడైనా అన్నానా..
సౌందర్య: అక్కడకు వెళ్లబోతున్న హిమని చేయిపట్టి ఆపిన సౌందర్య..నిరుపమ్ తన అభిప్రాయం చెబుతున్నాడు కదా నువ్వెలా వెళ్లి మాట్లాడుతావ్
జ్వాల: ఇదంతా అబద్ధం కదా..మీకు జోక్ చేస్తున్నారు కదా..నన్ను ఏడిపిస్తున్నారు కదా..
నిరుపమ్: చెప్తుంటే అర్థంకావడం లేదా..నేను నిన్ను ప్రేమించడం లేదు..నాకు పెళ్లి ఫిక్సైంది నీకు అర్థమవుతోందా..
జ్వాల: మరి నాలో ఆశలెందుకు రేపారు..
నిరుపమ్: చూడు జ్వాలా అవన్నీ నువ్వు ఊహించుకున్నావ్..నా తప్పుకాదు
జ్వాల: తప్పు కాదంటావేంటి..నువ్వు నా కోసమే పుట్టావ్..నువ్వు నా ఫ్యామిలీ అందరకీ సేవ చేస్తున్నావ్..నువ్వు సూపప్ ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి అని కాలర్ పట్టుకుని క్వశ్చన్ చేస్తుంది..మాట్లాడండి...నాకు ఆటో ఎందుకు కొనిచ్చారు, నా మనసులో మాట ఎందుకు చెప్పమన్నారు, నాకు బట్టలెందుకు కొనిచ్చారు ఏంటిదంతా..మాట్లాడండి.. ఆటో నడుపుకునేదాన్ని నన్ను డాక్టర్ సాబ్ ఇష్టపడుతున్నాడేంటని చాలా పొంగిపోయాను..అసలు నేను ఆడపిల్లని అని మీరే గుర్తుచేశారు.. ఎవరు నన్ను ఒక్క మాట అన్నా మీరు అడ్డొచ్చారు..ఏంటిదంతా...
నిరుపమ్: అది ప్రేమ కాదు..అన్నీ నీకు నువ్వుగా అనుకున్నావ్.. అమ్మాయిలతో ఇదే ప్రోబ్లెం. ప్రేమిస్తే స్నేహం అనుకుంటారు, స్నేహం చేస్తే ప్రేమ అనుకుంటార..
జ్వాల: తప్పందా నాదే అంటారా
నిరుపమ్: తప్పందా నీదే..ఇంకోసారి మనమధ్య మాటలు, స్నేహాలు ఉండకపోవచ్చు. వీలైతే నా పెళ్లికి రా జ్వాలా...
ఇదంతా వింటున్న సౌందర్య, హిమ..జ్వాల(శౌర్య) పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు...
జ్వాల: ఒక్క మాటకి సమాధానం చెప్పి వెళ్లండి...నేను ఆటో నడుపుకునే దాన్ని కావొచ్చు..పెద్దగా నీలా చదువుకోపోవచ్చు... కానీ ప్రేమించడానికి మనసుంటే చాలని తెలుసు..మరిది మీకు తెలియడం లేదు..డాక్టర్ సాబ్ మీరు పెళ్లిచేసుకోబోయేది డాక్టర్ నేనా?
నిరుపమ్: అవును
జ్వాల: మనసు చంపుకుని నాపై ప్రేమను చంపుకుని ఆశోభను పెళ్లిచేసుకుంటున్నారు కదా..నాకు నిజం చెప్పడం లేదు కదా
నిరుపమ్: నేను శోభను పెళ్లిచేసుకోవడం ఏంటి..
జ్వాల: మీ ఫ్రెండ్ ఆ తింగరినా..
నిరుపమ్: అవును అని తలూపుతాడు 
జ్వాల: తింగరి(హిమ) తనతో చెప్పిన మాటలన్నీ గుర్తుచేసుకుంటుంది. మీరు తనని పెళ్లిచేసుకోవడం ఏంటి. నిజం చెప్పండి. ఇది జోక్ కదా. మీరిద్దరూ కలసి నన్ను పరీక్షిస్తున్నారు కదా. చెప్పండి డాక్టర్ సాబ్.తను మిమ్మల్ని ఎందుకు పెళ్లిచేసుకుంటుంది.
నిరుపమ్: నేను పెళ్లిచేసుకునేది మీ తింగరినే..తననే నేను ప్రేమించాను..చూడు జ్వాలా..నీది ఆకర్షణ మాత్రమే ప్రేమ కాదు..
జ్వాల: నాది ప్రేమ కాదని మీరెలా చెబుతారు..నాది ప్రేమే..
నిరుపమ్: జ్వాలా..నీకు నువ్వు ఊహించుకుని ..నీకు నువ్వు అన్నీ అనుకుంటే అది నాతప్పు కాదు..జీవితం అంటే ఊహ కాదు నిజానిజాలు తెలుసుకోవాలి. రక్తంతో బొమ్మ గీస్తే బొమ్మ వస్తుంది ప్రేమ రాదు..
జ్వాల: మాటలు చెబుతున్నారా  ఇక్కడి నుంచి వెళ్లిపోండి..మీ మాటలు అబద్ధం, చేతలు అబద్ధం..మీరంతా అబద్ధం..
నువ్వు, ఆ తింగరి ఇద్దరూ అబద్ధమే. 
నిరుపమ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు...జ్వాల కింద కూర్చుని ఏడుస్తుంటుంది..


Also Read: హృదయం ఓర్చుకోలేనిది గాయం, రిజెక్టెడ్ పీస్ ని అని ఎమోషనల్ అయిన రిషిని చూసి తట్టుకోలేకపోయిన వసుధార


రేపటి( గురువారం) ఎపిసోడ్
ఇంట్లో కూర్చుని నిరుపమ్ మాటలే తల్చుకుంటుంది జ్వాల. మీ ఇద్దరి మధ్యా గొడవేంటి అని సౌందర్య అడిగితే నేను తనని ఎంత ప్రేమించానో తెలుసా అని రక్తంతో బొమ్మ గీశాను అని చూపిస్తుంది. ఎంత కష్టం వచ్చిందే నీకు అని సౌందర్యతో నా కష్టం విని నువ్వు ఫీలవుతున్నావా అంటుంది జ్వాల.


Also Read:  నిజమేనా నిజమేనా మన కథ ముగిసెనా చీకటిలో ఒంటరిగా నా మది మిగిలెనా, వసు ప్రేమని గుర్తించలేకపోతున్న రిషి