Streambox DorOS: సాధారణంగా మనం వైఫై తీసుకుంటే దానికి రూటర్‌ను ఫ్రీగా ఇస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు తీసుకుంటే టీవీ ఫ్రీగా ఇచ్చే ఆప్షన్‌ను కూడా ఇప్పుడు తీసుకువచ్చారు. కానీ దీనికి కాస్త యాక్టివేషన్ ఫీజును ముందుగా పే చేయాల్సి ఉంటుంది. మైక్రోమ్యాక్స్ సపోర్ట్‌తో స్ట్రీమ్‌బాక్స్ మీడియా అనే సంస్థ ఈ వినూత్న ప్రయత్నం చేసింది. టీవీని సర్వీస్ మోడల్‌గా ఇందులో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో సాధారణ టీవీని కాకుండా మంచి క్వాలిటీ ఉండే క్యూఎల్ఈడీ టీవీని దీంతోపాటు అందించనున్నారు. కంపెనీ స్వయంగా రూపొందించిన డోర్ఓఎస్‌పై ఈ టీవీ రన్ కానుంది.


స్ట్రీమ్‌బాక్స్ డోర్ క్యూఎల్ఈడీ టీవీ ధర ఎంత?
స్ట్రీమ్‌బాక్స్ డోర్ క్యూఎల్ఈడీ టీవీ మూడు వేర్వేరు సైజుల్లో అందుబాటులోకి వస్తుంది. 43 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాల సైజుల్లో ఈ టీవీలను కొనుగోలు చేయవచ్చు. ఇందులో 43 అంగుళాల క్యూఎల్ఈడీ టీవీ సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు రూ.799గా ఉంది. ఇది మొదటి 12 నెలల వరకు మాత్రమే. 43 అంగుళాల టీవీ తీసుకోవాలంటే వినియోగదారులు ముందుగా రూ.10,799 యాక్టివేషన్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. మొదటి 12 నెలల తర్వాత సబ్‌స్క్రిప్షన్ ధరలు రూ.299 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు. 55 అంగుళాలు, 65 అంగుళాల మోడల్స్ 2025లో అందుబాటులోకి రానున్నాయి.


ఈ టీవీపై నాలుగు సంవత్సరాల వారంటీని కంపెనీ అందించనుంది. నాలుగు సంవత్సరాల పాటు డోర్ఓఎస్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు కూడా లభించనున్నాయి. మొదటి 12 నెలల పాటు ఉపయోగించిన తర్వాత డివైస్‌ను తిరిగి ఇచ్చేసే ఆప్షన్ కూడా ఉంది. తిరిగి ఇచ్చేస్తే రూ.5000 వరకు నగదు తిరిగి రానుంది.


Also Read: ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!


స్ట్రీమ్‌బాక్స్ డోర్ క్యూఎల్ఈడీ టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
స్ట్రీమ్‌బాక్స్ డోర్ క్యూఎల్ఈడీ టీవీ 43 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాల స్క్రీన్‌ల్లో లభించనుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న 4కే డిస్‌ప్లేలను వీటిలో అందించారు. స్పోర్ట్, సినిమా, వివిడ్ పిక్చర్ మోడ్స్‌ కూడా ఇందులో ఉన్నాయి. 40W డాల్బీ ఆడియో డౌన్ ఫైరింగ్ స్పీకర్లు ఈ టీవీలో అందించారు. 1.5 జీబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్ ఈ టీవీల్లో ఉండనుంది. డోర్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ రన్ కానుంది.


డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ టైప్-సీ, ఎథర్‌నెట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఏవీ ఇన్‌పుట్, కోయాక్సియల్ పోర్ట్స్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. డోర్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టం ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా, సోనీ లివ్, ఫ్యాన్ కోడ్, డిస్కవరీ ప్లస్ వంటి 24 ఓటీటీ యాప్స్, 300కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్‌ను సింగిల్ సబ్‌స్క్రిప్షన్‌తో ఎంజాయ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. ప్రస్తుతానికి నెట్‌ఫ్లిక్స్ కంపెనీ అందించే ప్లాన్లలో లేదు. త్వరలో దీన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.


కస్టమైజబుల్ హోం స్క్రీన్ లే అవుట్స్, కలర్ స్కీమ్స్, బిల్ట్ ఇన్ వాయిస్ అసిస్టెంట్, సోలార్ పవర్డ్ రిమోట్ వంటి అదనపు ఆకర్షణలు కూడా లభించనున్నాయి. వేర్వేరు మీడియా ఫార్మాట్లను ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. పేరెంటల్ కంట్రోల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.



Also Read: ఐఫోన్ రేట్‌తో లాంచ్ అయిన రియల్‌మీ జీటీ 7 ప్రో - అంత రేటు వర్తేనా?