Sony Bravia XR X90L: సోనీ బ్రేవియా ఎక్స్ఆర్ ఎక్స్90ఎల్ టీవీ సిరీస్ మనదేశంలో లాంచ్ అయ్యాయి. దీని ధర రూ.1,39,900 నుంచి ప్రారంభం కానుంది. ఎక్స్90కేకి తర్వాతి వెర్షన్‌గా ఈ సిరీస్ లాంచ్ అయింది. ఎక్స్90కే సిరీస్ టీవీలు మనదేశంలో గతేడాది జూన్‌లో లాంచ్ అయ్యాయి. ఇందులో ఫుల్ అరే ట్రిల్యుమినస్ క్వాంటం డాట్ ఎల్ఈడీ డిస్‌ప్లే ప్యానల్స్ ఉన్నాయి. 55 అంగుళాల నుంచి 75 అంగుళాల వరకు వేర్వేరు సైజుల్లో ఉన్నాయి. 


సోనీ బ్రేవియా ఎక్స్ఆర్ ఎక్స్90ఎల్ ధర
ఈ సిరీస్‌లో మూడు వేర్వేరు సైజుల్లోని టీవీలు ఉన్నాయి. వీటిలో 55 అంగుళాల వేరియంట్ ధర రూ.1,39,990గా ఉంది. ఇక 65 అంగుళాల వేరియంట్ ధర రూ.1,79,990 నిర్ణయించారు. 75 అంగుళాల వేరియంట్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. కానీ రూ.2 లక్షలకు పైగానే ఉండే అవకాశం ఉంది. సోనీ సెంటర్ స్టోర్లు, ప్రముఖ ఎలక్ట్రానిక్స్ స్టోర్లు, ఆన్‌లైన్ రిటైలర్ల వద్ద దీన్ని కొనుగోలు చేయవచ్చు.


సోనీ బ్రేవియా ఎక్స్ఆర్ ఎక్స్90ఎల్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ మూడు టీవీల్లోనూ అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లేలు అందించారు. వీటి స్క్రీన్ రిజల్యూషన్ 3840x2160 పిక్సెల్స్‌గా ఉన్నాయి. సోనీ ట్రిల్యుమినస్ క్వాంటం డాట్ టెక్నాలజీతో వీటిని రూపొందించారు. డాల్బీ అట్మాస్ ఆడియో, డాల్బీ విజన్ ఫార్మాట్ వరకు హై డైనమిక్ రేంజ్ కంటెంట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఐమ్యాక్స్ ఎన్‌హేన్స్‌డ్ మోడ్, నెట్‌ఫ్లిక్స్ అడాప్టివ్ క్యాలిబరేటెడ్ మోడ్ వంటి ఫీచర్లను కూడా సోనీ ఈ సిరీస్ టీవీల్లో అందించింది.


ఇక సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే సోనీ బ్రేవియా ఎక్స్ఆర్-ఎక్స్90ఎల్ టీవీలు ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తాయి. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. 10 వేలకు పైగా యాప్స్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఇది బ్రేవియా ఎక్స్ఆర్ టీవీ కాబట్టి వినియోగదారులకు బ్రేవియా కోర్ స్ట్రీమింగ్ సర్వీస్‌కు యాక్సెస్ లభిస్తుంది.


ఇమేజ్ ప్రాసెసింగ్, అకౌస్టిక్ మల్టీ ఆడియో సౌండ్, ఎయిర్ ప్లే 2, హోమ్ కిట్, గేమింగ్ ఫీచర్ల సపోర్ట్ కోసం సోనీ కాగ్నిటివ్ ప్రాసెసర్ ఎక్స్‌ఆర్‌ను ఇందులో అందించారు. సోనీ ప్లేస్టేషన్ 5 గేమింగ్ కన్సోల్‌తో మరింత అద్భుతమైన గేమింగ్ ఫీచర్‌ను ఇది అందించనుంది.


సోనీ ఎక్స్‌పీరియా 5 ఐవీ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ ఎంపిక చేసిన దేశాల్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర యూరోప్‌లో 1,049 యూరోలుగా (సుమారు రూ.83,700) ఉంది. యూకేలో దీని ధరను 949 పౌండ్లుగా (సుమారు రూ.87,600) నిర్ణయించారు. ఇక అమెరికాలో దీని ధర 999.99 డాలర్లుగా (సుమారు రూ.79,600) ఉంది. బ్లాక్, వైట్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.


ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.1 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ ఫుల్ హెచ్‌డీ+గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 21:9 కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది.



Read Also: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?