శాంసంగ్ తన ఫ్రేమ్ టీవీ సిరీస్‌ను మనదేశంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇవి ఇప్పటికే గ్లోబల్ లాంచ్ అయ్యాయి. 43 అంగుళాల నుంచి 75 అంగుళాల వరకు వేర్వేరు సైజుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. కేవలం టీవీలా మాత్రమే కాకుండా ఆర్ట్ పీసెస్‌లా ఈ టీవీని ఉపయోగించవచ్చు.


శాంసంగ్ ద ఫ్రేమ్ ధర
ఇందులో 43 అంగుళాల వేరియంట్ ధర మనదేశంలో రూ.61,990 నుంచి ప్రారంభం కానుంది. 50 అంగుళాల వేరియంట్ ధర రూ.73,990గానూ, 55 అంగుళాల వేరియంట్ ధర రూ.91,990 గానూ, 65 అంగుళాల వేరియంట్ ధర రూ.1,27,990 గానూ, 75 అంగుళాల వేరియంట్ ధర రూ.2,99,990 గానూ నిర్ణయించారు. ఈ టీవీ అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్లలో వీటి సేల్ ప్రారంభం కానుంది.


శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్, శాంసంగ్ షాప్‌ల ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే 20 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది. రూ.7,690 విలువైన బెజెల్‌ను దీంతోపాటు ఉచితంగా అందించనున్నారు. 75 అంగుళాల మోడల్‌ను కొనుగోలు చేస్తే శాంసంగ్ గెలాక్సీ ఏ32, 65 అంగుళాల మోడల్ కొనుగోలు చేస్తే గెలాక్సీ ఏ03 స్మార్ట్ ఫోన్లను ఉచితంగా పొందవచ్చు. దీనిపై బ్యాంక్ ఆఫర్లను కూడా అందించారు.


శాంసంగ్ ద ఫ్రేమ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే... ఇందులో 4కే క్యూఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 100 హెర్ట్జ్ కాగా, స్క్రీన్‌పై రిఫ్లెక్షన్‌ను కూడా ఇది ఎలిమినేట్ చేయనుంది. శాంసంగ్ క్వాంటం ప్రాసెసర్ 4కేపై ఈ టీవీ పనిచేయనుంది. హెచ్‌డీఆర్10+ అడాప్టివ్, హెచ్‌డీఆర్10+ గేమింగ్ సర్టిఫికేషన్‌ను ఇది పొందింది.


ఈ ఫ్రేమ్ టీవీలో 40W 2.0.2 చానెల్ స్పీకర్లను అందించారు. డాల్బీ అట్మాస్, అడాప్టివ్ సౌండ్ ప్లస్, డాల్బీ డిజిటల్ ప్లస్ ఎంఎస్12 5.1 చానెల్స్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. శాంసంగ్ టైజెన్ ఓఎస్‌పై ఈ టీవీ పని చేయనుంది. బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్, బిక్స్‌బీ, అలెక్సాలకు సపోర్ట్‌ను ఈ టీవీలో అందించారు.


ఈ టీవీలో ఆర్ట్ మోడ్‌ను ఎనేబుల్ చేయడం ద్వారా ఆన్‌లో లేనప్పుడు పెయింటింగ్‌లా ఉపయోగించుకోవచ్చు. స్క్రీన్ మీద ఏ ఆర్ట్ ఫాం కనిపించాలో కూడా సెలక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. దాదాపు 1,600కు పైగా ఆర్ట్ వర్క్‌లను ఈ టీవీపై స్క్రీన్ సేవర్లుగా ఉపయోగించుకోవచ్చు.


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?