శాంసంగ్ క్రిస్టల్ 4కే నియో టీవీ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 43 అంగుళాల 4కే స్క్రీన్ అందించారు. హెచ్‌డీఆర్10+ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. అంచులు చాలా సన్నగా ఉండే సూపర్ డిజైన్‌ను ఇందులో అందించారు. డెడికేటెడ్ పీసీ మోడ్ కూడా ఈ టీవీలో ఉంది.
శాంసంగ్ క్రిస్టల్ 4కే నియో టీవీ ధర
దీని ధరను మనదేశంలో రూ.35,990గా నిర్ణయించారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ షాప్ వెబ్ సైట్లలో ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీని అమెజాన్‌లో కొనుగోలు చేస్తే ఒక సంవత్సరం పాటు ప్రైమ్ మెంబర్ షిప్ లభించనుంది. అదే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే డిస్నీప్లస్ హాట్‌స్టార్ వార్షిక సబ్‌స్క్రిప్షన్ లభించనుంది.
శాంసంగ్ క్రిస్టల్ 4కే నియో స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ టీవీ టైజెన్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 43 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. హెచ్‌డీఆర్10+ సపోర్ట్ కూడా ఉంది. యూహెచ్‌డీ డిమ్మింగ్, 100 కోట్లకు పైగా ట్రూ కలర్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. క్రిస్టల్ 4కే ప్రాసెసర్‌పై ఈ టీవీ పనిచేయనుంది. 1.5 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది.
క్రిస్టల్ 4కే నియో టీవీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. శాంసంగ్ టీవీ ప్లస్ ద్వారా 55 గ్లోబల్, లోకల్ లైవ్ టీవీ చానెళ్లను యాక్సెస్ చేయవచ్చు. అలెక్సా, బిక్స్‌బీ, గూగుల్ అసిస్టెంట్లను ఈ స్మార్ట్ టీవీ సపోర్ట్ చేయనుంది. వినియోగదారులు తమకు కావాల్సిన కంటెంట్‌ను వాయిస్ సెర్చ్ చేయవచ్చు.
డాల్బీ డిజిటల్ ప్లస్‌ను ఈ టీవీలో అందించారు. 20W స్పీకర్లు కూడా ఇందులో ఉన్నాయి. వైఫై, బ్లూటూత్, మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, ఒక యూఎస్‌బీ పోర్టు ఇందులో ఉన్నాయి. బ్లూటూత్, ఇన్‌ఫ్రారెడ్ (ఐఆర్) కనెక్టివిటీ సపోర్ట్ ఉన్న రిమోట్‌ను టీవీతో పాటు అందించనున్నారు.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!