వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ ప్రో సిరీస్‌లో మరో స్మార్ట్ టీవీ మనదేశంలో లాంచ్ కానుంది. 50 అంగుళాల 4కే డిస్‌ప్లేతో వన్‌ప్లస్ టీవీ 50 వై1ఎస్ ప్రో మనదేశంలో అతి త్వరలో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సిరీస్‌లో 43 అంగుళాల మోడల్ టీవీ రెండు నెలల క్రితం లాంచ్ అయింది. ఇప్పుడు 50 అంగుళాల డిస్‌ప్లేతో కొత్త మోడల్‌ను దించనున్నారు. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వన్‌ప్లస్ ఉత్పత్తులను ఎక్కువగా విక్రయించే ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఈ టీవీ లిస్ట్ అయింది.
వన్‌ప్లస్ టీవీ 50 వై1ఎస్ ప్రో త్వరలో లాంచ్ అవుతుందంటూ వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్‌లో మైక్రోసైట్లను అప్‌డేట్ చేశారు. అయితే వీటిలో ఈ టీవీకి సంబంధించిన కొన్ని కీలకమైన స్పెసిఫికేషన్లను కూడా కంపెనీ టీజ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీకి సంబంధించి కచ్చితమైన లాంచ్ తేదీని వన్‌ప్లస్ ఇంకా ప్రకటించలేదు. జులై నెల ప్రారంభంలోనే ఈ టీవీ విడుదల అయ్యే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ టీవీ 50 వై1ఎస్ ప్రో స్పెసిఫికేషన్లు
ఈ వన్‌ప్లస్ టీవీలో 50 అంగుళాల డిస్‌ప్లే అందించనున్నారు. ఇందులో 10-బిట్ కలర్ డెప్త్, ఇమేజ్ క్వాలిటీ అత్యుత్తమంగా ఉండేందుకు గామా ఇంజిన్ అందించారు. దీంతోపాటు మోషన్ ఎస్టిమేషన్ కాంపన్సేషన్ (ఎంఈఎంసీ), హెచ్‌డీఆర్10 సపోర్ట్ కూడా వన్‌ప్లస్ ఈ టీవీల్లో అందించనుంది.
డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 24W సౌండ్ ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లు ఉండనుంది. స్మార్ట్ వాల్యూమ్ కంట్రోల్ ఫీచర్ కూడా అందించనున్నారు. దీంతో యూజర్లు వన్‌ప్లస్ వాచ్ ద్వారా కూడా టీవీ వాల్యూమ్‌ను కంట్రోల్ చేయవచ్చు. స్లీప్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఈ టీవీలో ఉండనుంది. ఒకవేళ టీవీ చూస్తూ మీరు నిద్రపోతే టీవీ కూడా స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. ఈ టీవీలో 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించనున్నారు. ఈ స్మార్ట్ టీవీ ధర రూ.35 వేల నుంచి రూ.40 వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!