Xiaomi Smart TV X Pro Series: షావోమీ స్మార్ట్ టీవీ ఎక్స్ ప్రో సిరీస్ మనదేశంలో లాంచ్ అయింది. ఇది గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. 43 అంగుళాలు, 50 అంగుళాలు, 55 అంగుళాల సైజుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ మూడు వేరియంట్లలోనూ 4కే హెచ్‌డీఆర్ స్క్రీన్లు అందించారు. డాల్బీ విజన్ ఐక్యూ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్టెడ్ స్పీకర్ సిస్టం కూడా ఈ టీవీల్లో ఉంది. 40W సౌండ్ అవుట్‌పుట్‌ను ఇది అందించనుంది. యూట్యూబ్, ప్యాచ్ వాల్, క్రోమ్ కాస్ట్, గూగుల్ ప్లే స్టోర్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌లను ఇది సపోర్ట్ చేయనుంది.
షావోమీ స్మార్ట్ టీవీ ఎక్స్ ప్రో ధర
ఈ టీవీ సిరీస్‌లో 43 అంగుళాల వేరియంట్ ధరను రూ.32,999గా నిర్ణయించారు. 50 అంగుళాల మోడల్ ధర రూ.41,999 గానూ, 55 అంగుళాల మోడల్ ధరను రూ.47,999 గానూ నిర్ణయించారు. ఎంఐ.కాం, ఎంఐ హోమ్స్, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
షావోమీ స్మార్ట్ టీవీ ఎక్స్ ప్రో 43 అంగుళాల వేరియంట్ ధరపై రూ.1,500 స్పెషల్ బ్యాంక్ డిస్కౌంట్ అందించారు. దీని కారణంగా రూ.31,499కు ఈ ఫోన్ కొనవచ్చు. 50 అంగుళాలు, 55 అంగుళాల వేరియంట్లపై రూ.2,000 డిస్కౌంట్ ఉంది. ఏప్రిల్ 19వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది.
షావోమీ స్మార్ట్ టీవీ ఎక్స్ ప్రో స్పెసిఫికేషన్లు
ఈ మూడు మోడల్స్ గూగుల్ టీవీ ఆధారిత షావోమీ ప్యాచ్ వాల్ యూఐపై పని చేస్తాయి. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టంతో లాంచ్ అయిన మొట్టమొదటి షావోమీ టీవీ సిరీస్ ఇదే. ఈ టీవీలో వేర్వేరు యూజర్ ప్రొఫైల్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మెటల్ లెస్ బెజెల్ డిజైన్‌తో ఈ టీవీలు లాంచ్ అయ్యాయి. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 96.6 శాతంగా ఉంది. డాల్బీ విజన్ ఐక్యూ, వివిడ్ పిక్చర్ ఇంజిన్ 2 టెక్నాలజీతో ఈ టీవీలు లాంచ్ అయ్యాయి.
అన్ని మోడల్స్‌లోనూ 4కే హెచ్‌డీఆర్ ఎనేబుల్డ్ స్క్రీన్లను అందించారు. ఇన్‌బిల్ట్ గూగుల్ క్రోమ్‌కాస్ట్ కూడా ఈ టీవీలో ఉంది. మీ స్మార్ట్ ఫోన్ ద్వారా సినిమాలు, సిరీస్, ఫొటోలు ఇతర కంటెంట్‌ను స్ట్రీమ్ చేయడానికి ఇది ఉపయోగపడుంది. ప్యాచ్ వాల్ యూజర్ ఇంటర్ ఫేస్ ద్వారా అమెజాన్ ప్రైమ్, డిస్నీప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలను యాక్సెస్ చేయవచ్చు. ఇందులో 40W స్పీకర్ సిస్టంను అందించారు. డీటీఎస్ : ఎక్స్ టెక్నాలజీ, డాల్బీ అట్మాస్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. 43 అంగుళాల మోడల్‌కు 30W స్పీకర్‌ను అందించారు.
ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరికొత్త స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తేవడంలో ముందుంటుంది చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజ సంస్థ Xiaomi. మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలతో వీటిని విడుదల చేస్తుంది. తాజాగా ఈ కంపెనీ మరో సూపర్ డూపర్ స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తేబోతోంది. ఈ నెల 18వ తేదీన Xiaomi 13 Ultra స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేయబోతోంది.