టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతున్న కొద్దీ, అదే స్థాయిలో స్మార్ట్ నేరాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న టెక్ వరల్డ్ లో వ్యక్తిగత డేటాను సురక్షితంగా ఉంచుకోవడం అంత సులభం కాదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే, మీ వ్యక్తిగత సమాచారాన్ని ఏ యాప్ తీసుకుంటుందో? ఎక్కడ దాన్ని చెడుగా ఉపయోగిస్తుందో? తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్లను సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోటోలు, ఇమెయిల్,  బ్యాంక్ వివరాల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. అందుకే, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్‌ ను సురక్షితంగా ఉంచేందుకు 5 టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..   


ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను సురక్షితంగా ఉంచడానికి మీరు సెట్టింగులను మార్చుకోవాలి. ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. స్మార్ట్ ఫోన్ ను భద్రంగా ఉంచుకునేందుకు అవసరమైన సెట్టింగులను ఎలా ఎనేబుల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..  


1. మీ స్మార్ట్ ఫోన్ ను అప్ డేట్ చేయండి


 ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ సేఫ్ గా ఉంచుకునేందుకు ముందుగా మీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్‌తో అప్‌డేట్ చేయడం తప్పనిసరి. ఇలా చేయడం మూలంగా మీ స్మార్ట్ ఫోన్ లో ఏదైనా బగ్ లేదంటే భద్రతా సమస్య ఉంటే పరిష్కరిస్తుంది.  స్మార్ట్‌ ఫోన్‌ను అప్‌డేట్ చేయకపోవడం వల్ల భద్రతా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. Android 13తో, మీ ఫోన్‌లో ఏ అప్లికేషన్ ద్వారా ఏ డేటాను యాక్సెస్ చేయవచ్చో మీరు తెలుసుకోవచ్చు. కొత్త వెర్షన్‌కి అప్‌డేట్ అయిన వినియోగదారుల స్మార్ట్‌ ఫోన్‌ మరింత సురక్షితంగా ఉంటుంది.  మీరు ఇప్పటికే ఆండ్రాయిడ్ వెర్షన్ 13కి అప్‌డేట్ చేయకుంటే, వెంటనే ఆ పని చేయండి.


2. మీ యాప్ పర్మిషన్స్ లో ఛేంజెస్ చేయండి   


మీ ఫోన్‌లోని ఉన్న పలు అప్లికేషన్‌లు కొన్ని వ్యక్తిగత సమాచారానికి యాక్సెస్ అడిగే అవకాశం ఉంటుంది.  అయితే, మీ సమాచారాన్ని ఏ యాప్ యాక్సెస్ చేయగలదో నియంత్రించడానికి  ఒక మార్గం ఉంది. మీరు అనుమతులను మార్చడానికి సెట్టింగ్‌లు> యాప్‌లు, నోటిఫికేషన్‌లు> యాప్‌పై ట్యాప్ చేయడం ద్వారా ఈ ఫీచర్‌ను ప్రారంభించవచ్చు.


3. Google Play ప్రొటెక్షన్ ను డౌన్‌లోడ్ చేయండి


Google Play Protect అనేది మీ పరికరంలో ఏదైనా థ్రెట్  ఉంటే తనిఖీ చేసి చెప్తుంది. ఎప్పటికప్పుడు మీ స్మార్ట్ ఫోన్ ను రక్షించేలా చర్యలు తీసుకుంటుంది. ఏదైనా ప్రమాదకరమైన అంశాన్ని గుర్తిస్తే, అది తక్షణమే యాప్ ఫంక్షన్‌ను బ్లాక్ చేస్తుంది. మీ మొబైల్ నుండి ప్రమాదకరమైన అప్లికేషన్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసేలా అలర్ట్ చేస్తుంది.


4. మీ Android ఎన్‌క్రిప్షన్ చేయండి


Google 2015లో ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌లను విడుదల చేసింది. దీని ద్వారా వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని PIN, ఫింగర్‌ ప్రింట్, పాస్‌వర్డ్,  ప్యాటర్న్‌తో భద్రపరిచేందుకు అనుమతించారు. కొన్ని పరికరాలు డిఫాల్ట్‌ గా ఎన్‌క్రిప్షన్ చేయబడుతాయి. లేకపోతే సెట్ చేసుకోవాలి.


5. ఫైండ్ మై డివైజ్ ఫీచర్ ఎనేబుల్ చేయండి  


కొన్ని సార్లు మీ స్మార్ట్ ఫోన్ ను ట్రాక్ చేయవచ్చు. ఒక్కోసారి ఫోన్ పోగొట్టుకున్నట్లైతే వెతికి పట్టుకునే అవకాశం ఉంటుంది. లేదంటే ఈ ఫీచర్ సాయంతో స్మార్ట్ ఫోన్ ను లాక్ చేసుకోవచ్చు. అన్ని Android ఫోన్లలో ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.  మీరు మీ ఫోన్‌లో లొకేషన్ ఫీచర్‌ను ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచాలి.  


Read Also: ట్విట్టర్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ పొందిన మస్క్ ట్వీట్ - ఎంత రీచ్ వచ్చింది?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial