Best Free Chess Apps: గత కొన్నేళ్లుగా దేశంలో చెస్‌కు ఆదరణ బాగా పెరిగింది. ప్రజలు సంప్రదాయ బోర్డుతో పాటు ఆన్‌లైన్ లేదా మొబైల్ యాప్స్‌లో చెస్ ఆడుతున్నారు. ఇటీవల భారతదేశానికి చెందిన డి.గుకేశ్ అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. దీంతో ప్రజల్లో చెస్‌పై క్రేజ్ కూడా బాగా పెరిగింది. మీ మొబైల్ ద్వారా ఇంట్లో కూర్చొని కూడా చెస్‌ను ఆడవచ్చు. దీని కోసం మీరు ఈ ఉచిత యాప్‌ల సహాయం తీసుకోవచ్చు.
చెస్ - ప్లే అండ్ లెర్న్ (Chess - Play and Learn)
దీనిపై మీరు ప్రపంచం నలుమూలల నుండి 15 లక్షల మంది చెస్ ఆటగాళ్లను చూడవచ్చు. ఇది 3.5 లక్షల కంటే ఎక్కువ స్ట్రాటజీ పజిల్స్‌ను కలిగి ఉంది. ఇది మీ గేమ్‌ను సవాలుగా మారుస్తుంది. దీనితో పాటు మీరు ఇక్కడ అనేక ఆన్‌లైన్ ట్యుటోరియల్స్, లెసన్స్‌ను కూడా చూడవచ్చు వాటి సహాయంతో మీరు మీ గేమ్‌ను మెరుగుపరచుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండింటికీ అందుబాటులో ఉంది.
లెర్న్ చెస్ విత్ డాక్టర్ వుల్ఫ్ (Learn Chess with Dr. Wolf)
మీరు చెస్ నేర్చుకోవాలనుకుంటే ఈ యాప్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ట్యుటోరియల్స్‌కు బదులుగా వ్యక్తిగత కోచింగ్‌ను అందిస్తుంది. ఇది ఇంటరాక్టివ్ చెస్ లెసన్స్, ఆడియో కోచింగ్, మిస్టేక్ కరెక్షన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇది చెస్ నేర్చుకోవడంలో మీకు సహాయపడుతుంది. ప్రస్తుతం మనదేశంలో చెస్‌కు మంచి డిమాండ్ పెరిగింది కాబట్టి ఈ యాప్స్ డౌన్‌లోడ్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
లైచెస్ (Lichess)
ఇది ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండింటికీ కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ కూడా మీరు పెద్ద సంఖ్యలో ప్లేయర్‌లను చూడవచ్చు. ఇందులో మీరు చెస్‌ను ఆస్వాదించవచ్చు. దీంతో పాటు ఇది మీ గేమ్‌ను ట్రాక్ చేసే సదుపాయాన్ని కూడా అందిస్తుంది. ఈ యాప్‌లో మీరు మీ పాత మ్యాచ్‌లను మళ్లీ చూడవచ్చు. ఇది గెలిచిన ఆటగాడి ప్రతి గ్రాఫ్‌ను కూడా మీకు అందిస్తుంది.
చెస్ 3డీ (Chess 3D)
ఈ గేమ్‌లో 3డీ గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. అలాగే మీరు మీ ఆప్షన్ ప్రకారం దాని మొత్తం డిజైన్‌ను కస్టమైజ్ చేయవచ్చు. ఈ యాప్‌లో చెస్ ఆడుతున్నప్పుడు మీరు బోర్డు మీద ఆడినట్లు ఫీల్ అవుతారు. ఇందులో మీరు ఏఐతో పాటు ప్రత్యర్థి ఆటగాడితో కూడా గేమ్‌ను ఆడే అవకాశాన్ని పొందుతారు.
రియల్లీ బ్యాడ్ చెస్ (Really Bad Chess)
ఇది ఒక కొత్త రకమైన చెస్ గేమ్ యాప్. ఇందులో మీరు ఆటను ప్రారంభం నుంచి మాత్రమే కాకుండా మధ్యలో నుంచి కూడా ఆడవచ్చు. ఈ గేమ్ మీకు రకరకాల ఛాలెంజ్‌లను జనరేట్ చేస్తుంది. ఇది నిపుణులైన ఆటగాళ్లకు అలాగే నేర్చుకుంటున్న కొత్త ఆటగాళ్లకు విభిన్న సవాళ్లను అందిస్తుంది.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!