Tim Cook steps down: యాపిల్ సంస్థను అగ్రపథంలో నడిపించిన టీమ్ కుక్, తన సీఈవో బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో తెలిపారు. హఠాత్తుగా వచ్చిన మెయిల్ చూసి యాపిల్ ఉద్యోగులు ఆశ్చర్యపోయాయరు. సంస్థ నాయకత్వ మార్పుకు ఇదే సరైన సమయం అని ఆయన పేర్కొన్నారు. స్టీవ్ జాబ్స్ తర్వాత యాపిల్ బాధ్యతలు చేపట్టిన కుక్, సంస్థ విలువను ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా, ఐఫోన్‌ను ఒక తిరుగులేని బ్రాండ్‌గా మార్చారు. అయితే, ఆయన హఠాత్తుగా ఎందుకు తప్పుకుంటున్నారు? సంస్థ లోపల ఏదైనా ఒత్తిడి ఉందా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
వారసుడిగా జాన్ టెర్నస్
టీమ్ కుక్ స్థానంలో యాపిల్ తదుపరి సీఈవోగా జాన్ టెర్నస్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం యాపిల్ హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న టెర్నస్, సంస్థలో అత్యంత నమ్మకస్తుడైన ఉన్నత ఉద్యోగిగా గుర్తింపు పొందారు. ఐఫోన్, ఐప్యాడ్ , మ్యాక్ వంటి ప్రధాన ఉత్పత్తుల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. టీమ్ కుక్ తన వారసుడిగా టెర్నస్‌ను ఎంపిక చేయడం ద్వారా, యాపిల్ తన హార్డ్‌వేర్ వారసత్వాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఏఐ పోటీని తట్టుకునేందుకే టీమ్ కుమార్ వైదొలుగుతున్నారా? టీమ్ కుక్ సరైన సమయం అని పేర్కొన్నప్పటికీ, విశ్లేషకులు మాత్రం దీనిని భిన్నంగా చూస్తున్నారు. ప్రస్తుతం యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో గట్టి పోటీని ఎదుర్కొంటోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఏఐలో దూసుకుపోతున్న తరుణంలో, టీమ్ కుక్ వైదొలగడం వెనుక కొత్త వ్యూహాలు ఉన్నాయా లేక ఏఐ సవాళ్లను ఎదుర్కోవడంలో కొత్త తరం నాయకత్వం అవసరమని భావిస్తున్నారా అన్నది చర్చనీయాంశమైంది. కుక్ నిష్క్రమణ ప్రకటన యాపిల్ షేర్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
జాన్ టెర్నస్ ముందు ఇప్పుడు భారీ సవాళ్లు ఉన్నాయి. కేవలం హార్డ్‌వేర్ ఉత్పత్తులే కాకుండా, యాపిల్ ఇంటెలిజెన్స్ వంటి ఏఐ ఆధారిత సేవలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. టీమ్ కుక్ హయాంలో సాధించిన ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగిస్తూనే, వినూత్న ఆవిష్కరణలతో వినియోగదారులను ఆకట్టుకోవడం టెర్నస్‌కు పెద్ద పరీక్ష కానుంది. ఏది ఏమైనా, కుక్ నిష్క్రమణతో యాపిల్ చరిత్రలో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసి, కొత్త శకం ప్రారంభం కాబోతోందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
