సాధారణంగా మన వెహికల్ ప్రమాదానికి గురైనప్పుడు వెంటనే మనం భయాందోళనకు గురవుతాం. కొన్ని సందర్భాల్లో టెన్షన్ పడి, ఆందోళనలో అన్నీ మర్చిపోతుంటారు. అలా చాలా మందికి జరుగుతుంటుంది. మరోవైపు రోజురోజుకూ జనాభా, వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా నిరంతరం పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో రోడ్డుపై వెళ్లేటప్పుడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలి. అయితే ఒకవేళ ప్రమాదం జరిగినట్లయితే, పెద్ద నష్టాల నుండి తప్పించుకోవడానికి మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

Continues below advertisement

ప్రమాదం జరిగిన తర్వాత టెన్షన్ పడకుండా, మొదట మీకు తగిలిన గాయాల తీవ్రత గురించి తెలుసుకోండి. మీ పరిస్థితి బాగున్నట్లు అయితే, కొన్ని ముఖ్యమైన చిట్కాలను పాటించాలి. ఈ చిట్కాలు మిమ్మల్ని పెద్ద ఇబ్బందుల నుంచి కాపాడటమే కాకుండా మీ భద్రతకు కూడా అవసరం. ఆ వివరాలను ఏంటి అనేది ఇక్కడ తెలుసుకోండి. 

రోడ్డు ప్రమాదాల సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి-  చాలా సందర్భాల్లో తమ తప్పు లేకపోయినా రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రదేశం నుంచి వెంటనే పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అలా చేయడానికి బదులు, ప్రమాదం ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు ఘటనా స్థలం నుండి పారిపోవడం వల్ల తప్పు లేకపోయినా కొన్నిసార్లు చిక్కుల్లో పడే అవకాశం ఉంది.

Continues below advertisement

-  ప్రమాదం జరిగినప్పుడు మీరు మొదటగా 100 లేదా 112 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలి. అవసరమైతే వారి సహాయం కూడా కోరవచ్చు.

-  ప్రమాదం జరిగిన వెంటనే కారు పార్కింగ్ లైట్లను ఆన్ చేయాలి. దీనివల్ల వెనుక నుండి వచ్చే వాహనాలకు ప్రమాదం పరిస్థితి ముందుగానే అర్థమవుతుంది. మరో ప్రమాదం జరగకుండా మీరు నివారించవచ్చు.

-  దీంతో పాటు మీ వాహనాన్ని ఢీకొట్టిన అవతలి వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను వెంటనే నోట్ చేసుకోవాలి. అలాగే, ఆ వాహనంలో ఉన్న లేదా వాహనం నడిపే వ్యక్తి వివరాలను అడిగి తెలుసుకోండి. దాంతో అవసరమైనప్పుడు ఆ వివరాలను మీరు పోలీసులకు అందించవచ్చు.

-  టైం వేస్ట్ చేయకుండా వెంటనే మీ మొబైల్‌తో ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసి పెట్టుకోవాలి. తద్వారా అవసరమైనప్పుడు పోలీసులకు వీటిని మీ వైపు నుంచి ఆధారాలుగా చూపవచ్చు.

-  మీరు చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం అందించాలి. ప్రమాదం జరిగిన తీరు, కారణాలను, మీ పరిస్థితిని అవకాశం దొరికిన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి తెలపాలి. వారు కోరిన వివరాలను అందజేయాలి, తరువాత కేసు నమోదైతే వివరాలను వారికి సమర్పిస్తే మీ ఇన్సూరెన్స్ లాంటివి క్లెయిమ్ ప్రాసెస్ త్వరగా పూర్తవుతుంది.